Asianet News TeluguAsianet News Telugu

సుపరిపాలనపై రెండో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి చెందేలా సుపరిపాలన అందిస్తున్నట్లు ఏపీ సీఎం సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో రెండోరోజు ఏపీ సుపరిపాలనపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఇప్పటి వరకు విడుదల చేసిన శ్వేతపత్రాల్లో ఇదిరెండోది. 
 

ap cm chandrababu naidu relesed second white paper
Author
Amaravathi, First Published Dec 24, 2018, 5:55 PM IST

అమరావతి: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి చెందేలా సుపరిపాలన అందిస్తున్నట్లు ఏపీ సీఎం సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో రెండోరోజు ఏపీ సుపరిపాలనపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఇప్పటి వరకు విడుదల చేసిన శ్వేతపత్రాల్లో ఇదిరెండోది. 

విద్యుత్ ఛార్జీలు పెంచబోమని ప్రకటన చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమేనని తెలిపారు. అన్ని శాఖలలోనూ ప్రజలను సంతృప్తి పరిచినట్లు తెలిపారు. రాష్ట్రప్రజలకు సుపరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు. 

పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. దేశచరిత్రలో ఇంత వేగంగా నిర్మించబడుతున్న ప్రాజెక్టు పోలవరం మాత్రమేనన్నారు. కేంద్రప్రభుత్వం ప్రకటించే అవార్డులలో బెస్ట్ ప్రాజెక్టు అవార్డ్ పోలవరం ప్రాజెక్టుకు దక్కిందన్నారు. 

హ్యాపి ఇండెక్స్ లో ఏపీ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. వ్యవసాయ రంగంలో 11 శాతం వృద్ధి సాధించినట్లు చంద్రబాబు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తున్నట్లు తెలిపారు. 

అలాగే సాగునీటి వినియోగంపై అనేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నదుల అనుసంధానం ద్వారా వ్యవసాయ రంగంలో అనేక మార్పులు తీసుకు వచ్చినట్లు తెలిపారు. రైతులు పండిస్తున్న పంటలను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

నాలుగేళ్లలో రైతుల ఆదాయన్ని రెట్టింపు చేసినట్లు చంద్రబాబు తెలిపారు. నదుల అనుసంధానాల ద్వారా అన్ని పంటలను కాపాడుతున్నట్లు తెలిపారు. వాటర్ మేనేజ్ మెంట్ లో ఆరోస్థానంలో ఉన్నట్లు తెలిపారు. 

ఆహారపు అలవాట్లకు అనుకూలంగా పంటలు పండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన ఏకైక రాష్ట్రప్రభుత్వం తమదేనని తెలిపారు. 
 

అలాగే రాష్ట్రంలో కాలుష్యాన్ని నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చంద్రబాబు తెలిపారు. అన్ని వాహనాలను విద్యుత్ తో నడిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.   

ఎల్ ఈడీ బల్బులు ఏర్పాటు చేసి విద్యుత్ ను ఆదా చేస్తున్నట్లు తెలిపారు. రైతులు వేసుకునే పంప్ సెట్లను సోలార్ విద్యుత్ తో అనుసంధానం చేసినట్లు తెలిపారు. రైతులు వద్ద సోలార్ విద్యుత్ మిగిలితే యూనిట్ రూపాయిన్నర చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలిపారు. 25 శాఖలను అనుసంధానం చేస్తూ నరేగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. 

గతంలో 28వేల కిలోమీటర్లు రోడ్లు వేస్తే తాము నాలుగేళ్లలో 23వేల 500 కిలొమీటర్ల మేర సిమ్మెంట్ రోడ్లు వేసినట్లు చంద్రబాబు తెలిపారు. ఆర్థిక అసమానతలను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. 

అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి తుఫాన్ లు ఎప్పుడు వస్తాయో తెలుసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios