అమరావతి: పెథాయ్ తుఫాన్‌పై విపక్షాల విమర్శలపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కౌంటరిచ్చారు. తుఫాన్ ఏ ప్రాంతంలో  తీరం దాటుతోందో ఖచ్చితంగా అంచనా వేసి జాగ్రత్తలు తీసుకొన్నట్టు చెప్పారు.విపక్షాల విమర్శలను విజ్ఞతకు వదిలేస్తున్నట్టు బాబు తెలిపారు.

పెథాయ్ తుఫాన్ బాధితులను  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కాకినాడకు సమీపంలోని భైరవపాలెం వద్ద పరామర్శించారు. పునరావాస కేంద్రంలో బాధితులకు  ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకొన్నారు.

1996లో కూడ హరికేన్ తుఫాన్ తీరం దాటుతోందని  తెలిసి జాగ్రత్తలు తీసుకొన్నామన్నారు. కానీ, ఆ సమయంలో  99 మంది మృత్యువాత పడ్డారని  ఆయన గుర్తు చేశారు.  కానీ ఆనాడు తుఫాన్ తీరం దాటే సమయంలో  తాను జిల్లాలోనే ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ఆనాటికి ఇవాళ్టికి పరిస్థితిలో అనేక మార్పులు వచ్చాయని  ఆయన గుర్తు చేశారు. టెక్నాలజీ బాగా పెరిగిందన్నారు. టెక్నాలజీని ఉపయోగించుకొని తుఫాన్ కారణంగా నష్టం ఎక్కువగా వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకొన్నట్టు ఆయన తెలిపారు.

పెథాయ్ తుఫాన్ కారణంగా  నష్టపోయిన అంచనాలను తయారు చేస్తున్నామని చెప్పారు.పంట నష్టాన్ని వెంటనే అంచనావేసి బాధితులకు పరిహారం చెల్లించనున్నట్టు బాబు చెప్పారు.తుఫాన్ సహాయక చర్యలపై విపక్షాల విమర్శలు అర్ధరహితమైనవని ఆయన కామెంట్ చేశారు.

సంబంధిత వార్తలు

పెథాయ్ బీభత్సం: చలిగాలులకు 25 మంది మృతి

పెథాయ్ సహాయక చర్యలపై డాక్యుమెంటరీ: అధికారులకు చంద్రబాబు ఆదేశం

తీరం దాటిన పెథాయ్, చంద్రబాబు సమీక్ష

పెథాయ్ తుపాను దాటికి ఆరుగురు మృతి....

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!

తీరం దాటిన పెథాయ్ తుఫాన్.. తూర్పుగోదావరిలో బీభత్సం

పెథాయ్ పవర్‌ ‘‘కోనసీమ’’ మీదనేనా..?

తుఫానుకు ‘‘పెథాయ్’’ అన్న పేరు వెనుక..?

‘‘పెథాయ్’’ ఎఫెక్ట్: ఏపీలో వర్షం, తెలంగాణలో చలి