నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన పెథాయ్ తుఫాను కోస్తాంధ్రలో బీభీత్సం సృష్టించింది. కేటగిరీ 5గా వచ్చిన హుధుద్ తుఫానుతో పోల్చితే పెథాయ్ కేటగిరీ 1 కింద రికార్డై అంతులేని నష్టాన్ని మిగిల్చింది. ఎడతెరిపి లేని వర్షానికి తోడు, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వీచిన చలిగాలుల ధాటికి 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 3.87 లక్షల పంట నష్టం జరిగింది...దీని విలువ రూ.450 కోట్లుగా అంచనా.. 80 విద్యుత్ సబ్ స్టేషన్లు దెబ్బతినగా, 297 మొబైల్ టవర్లు పాడైపోయాయి. 450 కరెంట్ స్తంభాలు ధ్వంసమయ్యాయి.

భారీ చెట్లు సైతం నేలకూలడంతో పాటు సముద్రంలో వేటకు వెళ్లిన 11 మంది సముద్రంలో గల్లంతయ్యారు. 50 మండలాలపై తుఫాను తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ పర్యటించబోతున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విశాఖ, విజయనగరం జిల్లాల్లో సీఎం పర్యటిస్తారు. 

పెథాయ్ సహాయక చర్యలపై డాక్యుమెంటరీ: అధికారులకు చంద్రబాబు ఆదేశం

తీరం దాటిన పెథాయ్, చంద్రబాబు సమీక్ష

పెథాయ్ తుపాను దాటికి ఆరుగురు మృతి....

ఎన్టీఆర్ పై పెథాయ్‌ తుఫాన్‌ ఎఫెక్ట్!

తీరం దాటిన పెథాయ్ తుఫాన్.. తూర్పుగోదావరిలో బీభత్సం

పెథాయ్ పవర్‌ ‘‘కోనసీమ’’ మీదనేనా..?

తుఫానుకు ‘‘పెథాయ్’’ అన్న పేరు వెనుక..?

‘‘పెథాయ్’’ ఎఫెక్ట్: ఏపీలో వర్షం, తెలంగాణలో చలి