తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు తమ నియోజకవర్గాలకు రానివ్వని పరిస్థితి ఉందని... స్వయంకృతాపరాధమే దీనికి కారణమని చంద్రబాబు అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండుంటే ప్రజల నుంచి తిరస్కారం ఉండేది కాదని సీఎం అభిప్రాయపడ్డారు. 


టీఆర్ఎస్, జనసేన, వైసీపీ, బీజేపీలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీలోని రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ కమిటీల నేతలతో చంద్రబాబు ఇవాళ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రజలు తమ నియోజకవర్గాలకు రానివ్వని పరిస్థితి ఉందని... స్వయంకృతాపరాధమే దీనికి కారణమని చంద్రబాబు అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండుంటే ప్రజల నుంచి తిరస్కారం ఉండేది కాదని సీఎం అభిప్రాయపడ్డారు.

తాను తెలుగుదేశం పార్టీ కుటుంబపెద్దను మాత్రమేనని.. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ప్రజా సేవ విషయంలో తనతో సహా ఎవరికీ మినహాయింపు లేదని చెప్పారు. సమర్థంగా పని చేసినంత వరకు ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారని స్పష్టం చేశారు.

అధికారంలోకి వచ్చిన నాటి ఈ ఐదేళ్లలో అనేక మందికి పదవులు ఇచ్చామన్న ఆయన.. భవిష్యత్తులో ఇంతకు మించి పదవులు ఇవ్వనున్నట్లు టీడీపీ బాస్ వెల్లడించారు. రోజుకు 81 వేల మంది సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారని.. దీనిని రెట్టింపు చేయాలని చంద్రబాబు కార్యకర్తలకు సూచించారు.

బూత్ కన్వీనర్ల శిక్షణను విజయవంతం చేయాలని కోరారు. నెల్లూరులో జరిగిన ధర్మ పోరాట సభను విజయవంతం చేసినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన సభలను విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

సీబీఐని బీజేపీ కలెక్షన్ బ్యూరోగా మార్చేసిందని మండిపడ్డారు. బీజేపీ, వైసీపీ, టీఆర్ఎస్, జనసేన ఒకే తానులో గుడ్డలని చంద్రబాబు విమర్శించారు. జగన్, కేసీఆర్, పవన్‌ అజెండా ఒక్కటేనని.. వీరిలో ఎవ్వరూ మోడీని విమర్శించరని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీనే లక్ష్యంగా చేసుకొంటారని ఆరోపించారు.. బీజేపీయేతర పక్షాలు ఏకతాటిపైకి రాకుండా చేయాలనేదే వీరి ప్రధాన ఉద్దేశ్యమని చంద్రబాబు ఆరోపించారు.

తెలంగాణ ఎన్నికలు: జగన్, పవన్‌లపై బాబు డౌట్ ఇదీ...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: చంద్రబాబుకు జీవన్మరణ

చంద్రబాబు భేటీ: కూటమి సారథిపై మమతా ట్విస్ట్

దిమ్మతిరిగే కౌంటరిచ్చిన సుహాసిని: కూకట్‌పల్లి నుండి పోటీకి కారణమిదే

అదే జరిగితే... చంద్రబాబు.. ప్రధాని అవుతారు..రాయపాటి

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి సుహాసిని ఆస్తులివే

చంద్రబాబుపై రోజా భర్త సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబుకి మమతా బెనర్జీ మద్దతు

కేంద్రానికి చంద్రబాబు మెలిక....ఏపీలో సీబీఐకి ‘‘నో ఎంట్రీ‘‘