Asianet News TeluguAsianet News Telugu

దిమ్మతిరిగే కౌంటరిచ్చిన సుహాసిని: కూకట్‌పల్లి నుండి పోటీకి కారణమిదే

కూకట్‌పల్లి  అసెంబ్లీ నియోజకవర్గం తనకు  కొత్త కాదని, తాను ఇక్కడే  చదువుకొన్నానని  నందమూరి హరికృష్ణ కూతురు  నందమూరి సుహాసిని చెబుతున్నారు. 

why suhasini contesting from kukatpally segment
Author
Hyderabad, First Published Nov 19, 2018, 1:45 PM IST

హైదరాబాద్: కూకట్‌పల్లి  అసెంబ్లీ నియోజకవర్గం తనకు  కొత్త కాదని, తాను ఇక్కడే  చదువుకొన్నానని  నందమూరి హరికృష్ణ కూతురు  నందమూరి సుహాసిని చెబుతున్నారు. తాను నాన్‌లోకల్ అని ప్రచారం  చేసేవారికి  తాను ఎక్కడ చదువుకొన్నానో బహుశా తెలియకపోవచ్చన్నారు. 

గ్రేటర్ హైద్రాబాద్‌ పరిధిలోని కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి  టీడీపీ  అభ్యర్థిగా  నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని పోటీ చేస్తోంది.  శనివారం నాడు ఆమె నామినేషన్ కూడ దాఖలు చేసింది.  ఆదివారం నాడు తొలిసారిగా ఆమె ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చారు. పార్టీ  సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా బీ ఫారం తీసుకొన్నారు.

కూకట్‌పల్లి నుండి  పోటీ చేస్తున్న సుహాసిని నాన్‌లోకల్ అంటూ  ప్రత్యర్థులు  ప్రచారం చేస్తున్నారు. అయితే తాను  కూకట్‌పల్లిలోనే పదో తరగతి నుండి పీజీ వరకు ఇక్కడే చదువుకొన్నానని ఆమె గుర్తు చేసుకొన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు భవనం లో ఆమె మీడియాతో మాట్లాడారు.

కూకట్‌పల్లి నియోజకవర్గంలోని ప్రజలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని  ఆమె తెలిపారు. తాను రాజకీయ కుటుంబంలో పుట్టి పెరిగినట్టు ఆమె చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి తాను రాకపోయినా కూడ  రాజకీయాలంటే తనకు చాలా ఆసక్తి ఉండేదన్నారు. తాతయ్యను, నాన్నను దగ్గర నుండి చూడడంతో  రాజకీయాలపై తనకు ఇష్టం ఏర్పడిందన్నారు. 

తనకు రాజకీయాలపై ఉన్న ఆసక్తిని గమనించే  చంద్రబాబు మామయ్య కూకట్‌పల్లి నుండి పోటీ చేసే అవకాశం కల్పించినట్టు తెలిపారు.కూకట్‌పల్లి నియోజకవర్గంలో తనకు మద్దతు ఇవ్వాలని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేతలను కలిసి కోరినట్టు ఆమె గుర్తు చేసుకొన్నారు. టీడీపీ తరపున పోటీ చేస్తే తామంతా గెలుపు కోసం పనిచేస్తామని  కుటుంబసభ్యులంతా అభయమిచ్చారని సుహాసిని చెప్పారు.

కూకట్‌పల్లి అంటేనే టీడీపీకి కంచుకోట. పార్టీ కేడర్‌తోపాటు నాన్న హరికృష్ణపై ఈ ప్రాంతవాసులు చూపే అభిమానం, బాబాయి బాలయ్య, సోదరులు కల్యాణ్‌రామ్‌, ఎన్టీఆర్‌ అభిమానులు తన గెలుపునకు అండగా నిలుస్తారనే ఆకాంక్షను ఆమె వ్యక్తం చేశారు. 

 కూకట్‌పల్లి టికెట్‌ ఆశించిన కార్పొరేటర్‌ మందడి శ్రీనివాసరావు, మాజీ మంత్రి పెద్దిరెడ్డితోపాటు ఫైవ్‌మెన్‌ కమిటీ సభ్యులందరూ కలిసికట్టుగా నావిజయానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని, దీంతో తన గెలుపు  నల్లేరుపై నడకేనన్నారు.

నియోజకవర్గంలో ప్రధాన సమస్యల పరిష్కారానికి జాబితా తయారు చేస్తున్నాం. టీడీపీ హయాంలోనే సైబరాబాద్‌ అభివృద్ధి చెంది ఈ ప్రాంతంలోని వేలాదిమందికి ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఈ స్థానం నుండి విజయం సాధించి మామయ్య చంద్రబాబు, మా నాన్న హరికృష్ణకు బహుమతిగా ఇస్తా. కారును ఢీకొట్టడం కన్నా.. ప్రజలకు మేలు జరగాలంటే సైకిల్‌కే ఓటేయాలని చెబుతున్నానని చెప్పారు.

సంబంధిత వార్తలు

సుహాసినీ కోసం.. రంగంలోకి ఎన్టీఆర్

కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థి సుహాసిని ఆస్తులివే

కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సుహాసిని

సుహాసినికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై స్పందించిన బాలయ్య

ఎన్టీఆర్‌‌కు నివాళులర్పించిన నందమూరి సుహాసిని

బరిలోకి సుహాసిని: తెర వెనక భువనేశ్వరి

మాధవరం తెలుగుదేశం ద్రోహి, అతన్ని ఓడిస్తా.. సుహాసిని నా బిడ్డ: పెద్దిరెడ్డి

అందుకే రాజకీయాల్లోకి వచ్చా, తండ్రిని తల్చుకొని కన్నీళ్లు పెట్టుకొన్న సుహాసిని

హరికృష్ణ సానుభూతి, ఎన్టీఆర్ ఛరిష్మా: టీడీపీ తురుపుముక్క సుహాసిని

నందమూరి సుహాసినీపై.. మిత్రపక్షం కాంగ్రెస్ తిరుగుబాటు

కూకట్‌పల్లి సుహాసినికి కేటాయింపు: బాబు వద్దకు పెద్దిరెడ్డి

 

 

Follow Us:
Download App:
  • android
  • ios