సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మమతా బెనర్జీని కలిసి కూటమి ఏర్పాటుపై చర్చలు జరిపారు. ఆనంతరం ఇరువురు కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరు మహా కూటమిని అందరూ ముందుండి నడిపిస్తారని మమతా బెనర్జీ అన్నారు.  

కోల్ కతా: తాము ఏర్పాటు చేయబోయే మహా కూటమి సారథిపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీ ట్విస్ట్ ఇచ్చారు. మహా కూటమికి ఎవరు సారథ్యం వహిస్తారనే ప్రశ్నకు ఆమె స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. తద్వారా ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ మహా కూటమికి సారథిగా ఉండబోరనే విషయాన్ని ఆమె చెప్పినట్లయింది.

సోమవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మమతా బెనర్జీని కలిసి కూటమి ఏర్పాటుపై చర్చలు జరిపారు. ఆనంతరం ఇరువురు కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరు మహా కూటమిని అందరూ ముందుండి నడిపిస్తారని మమతా బెనర్జీ అన్నారు.

Scroll to load tweet…

తామంతా సీనియర్ రాజకీయ నేతలమని, మోడీ కన్నా సీనియర్లమని చంద్రబాబు అన్నారు. కోల్ కతాలో జనవరి 19వ తేదీన జరిగే ర్యాలీలో తాను పాల్గొంటానని ఆయన చెప్పారు. తామంతా కలిసే ఉన్నామని, కలిసే ఉంటామని, బిజెపికి వ్యతిరేకంగా తాము పనిచేస్తున్నామని మమతా బెనర్జీ అన్నారు. 

తాము మమతా బెనర్జీతో కూడా మాట్లాడుతామని చంద్రబాబు చెప్పారు. మహా కూటమిలోకి మాయావతిని చేర్చుకునే విషయంపై ప్రశ్నించగా తాము టచ్ లో ఉన్నామని, తాము కలిసి పనిచేస్తామని చంద్రబాబు జవాబిచ్చారు. 

Scroll to load tweet…

Scroll to load tweet…

సంబంధిత వార్తలు

ప్రజాస్వామ్య రక్షణకు కలుస్తున్నాం: చంద్రబాబు

ప్రజాస్వామ్య రక్షణకు కలుస్తున్నాం: చంద్రబాబు

ప్రధాని ఎవరనేది అప్పుడే: దేవేగౌడతో భేటీ తర్వాత బాబు

బీజేపీయేతర ఫ్రంట్: దేవేగౌడ‌, కుమారస్వామిలతో బాబు భేటీ

బాబు ఫ్రంట్‌: ధర్మపోరాట దీక్షకు బీజేపీయేతర పార్టీలు