త్వరలో రానున్న లోక్ సభ ఎన్నికలపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన కామెంట్స్ చేశారు.

త్వరలో రానున్న లోక్ సభ ఎన్నికలపై టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిస్తే చంద్రబాబు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు జోస్యం చెప్పారు.

గతంలో దేవెగౌడ తక్కువ సీట్లు గెలిచి కూడా ప్రధాని అయ్యారని అన్నారు. తాను నరసరావుపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తానని రాయపాటి స్పష్టం చేశారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దింపేందుకు.. చంద్రబాబు బీజేపీ యేతర శక్తులను ఏకం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఎంపీ రాయపాటి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.