ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హీరో శివాజీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఏపీ బీజేపీ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన వైసీపీ అధినేత జగన్‌పై దాడి ఘటనలో చంద్రబాబు స్పందించిన తీరు సరిగా లేదన్నారు.

చేతిలో సినిమాలు లేని హీరో శివాజీ ఆపరేషన్ గరుడ అంటూ హడావిడి చేస్తున్నారని... దానిని పట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోందని వీర్రాజు ఎద్దేవా చేశారు. శివాజీ చెబుతున్నట్లుగా ఆపరేషన్ గరుడ నిజమే అయితే డీజీపీ.. శివాజీని పిలిపించి వివరాలు ఎందుకు తీసుకోవడం లేదని సోము ప్రశ్నించారు.

వైఎస్ జగన్‌పై దాడి చంద్రబాబు స్క్రిప్ట్‌లో భాగమేనని ఆరోపించారు. శివాజీ లాంటి జీరోను ఉపయోగించుకుని బాబు రాష్ట్రాన్ని పాలించే హక్కును కోల్పోయారని వీర్రాజు విమర్శించారు. ప్రతిపక్షనేతపై దాడి రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చలా మిగిలిపోతుందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన జగన్.. స్టేట్‌మెంట్ రికార్డ్ చేసిన సిట్

జగన్ కి చిన్నముల్లు కూడా గుచ్చుకోకుండా చూసుకున్నాం.. సోమిరెడ్డి

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్ పై దాడి... రంగంలోకి కేంద్ర దర్యాప్తు బృందం

జగన్‌‌పై దాడి: హైకోర్టుకెక్కిన వైసీపీ

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?