విశాఖ ఎయిర్ పోర్టులో ప్రతిపక్ష నేత జగన్ పై జరిగిన దాడిని తమ ప్రభుత్వంపై కి నెట్టాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. గురువారం జగన్ పై దాడి జరగగా.. దీనిపై సోమిరెడ్డి స్పందించారు. 

సీఐఎస్‌ఎఫ్‌ అదుపులో ఉండే విమానాశ్రయంలోకి ఓ వ్యక్తి కత్తితో లోనికి ప్రవేశిస్తే పట్టుకోలేకపోయారా? అని ప్రశ్నించారు. విశాఖలో దాడి జరిగితే జగన్‌ హైదరాబాద్‌ వెళ్లిన తర్వాత చికిత్స తీసుకోవడాన్ని ఏ విధంగా తీసుకోవాలని నిలదీశారు.

జగన్ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే చిన్న ముల్లు కూడా గుచ్చుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందని.. సీఐఎస్‌ఎఫ్‌ ఆధీనంలో ఉండే విమానాశ్రయంలో దాడి జరిగితే రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు.. జగన్‌పై దాడి చేసిన వ్యక్తి గురించి వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. జగన్‌లా చంద్రబాబుకు ఎలాంటి ఫ్యాక్షన్‌ చరిత్ర లేదని.. ఇతరులపై దాడులు చేయించాల్సి అవసరం ఆయనకు లేదన్నారు. జగన్‌కు సానుభూతి వచ్చేందుకే దాడి చేసినట్లు నిందితుడు స్వయంగా చెబుతున్నా వైసీపీ నేతలు దిగజారుడుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.


యూపీఏ ప్రభుత్వం గవర్నర్‌గా నియమించిన నరసింహన్‌పై ఎన్డీయే ప్రభుత్వం ఎందుకంత ప్రేమ చూపిస్తోందో చెప్పాలని మంత్రి సోమిరెడ్డి డిమాండ్‌ చేశారు. యూపీఏ హయాంలో ఏడేళ్లు గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ను ఎన్డీయే ప్రభుత్వం మరో ఐదేళ్లు అదే హోదాలో కొనసాగించడానికి కారణమేంటో చెప్పాలన్నారు. కేంద్రం ఏం చెబితే అది చేస్తున్నందుకే నరసింహన్‌ను గవర్నర్‌గా కొనసాగిస్తున్నారా? అని నిలదీశారు. జగన్‌పై దాడి ఘటనకు సంబంధించి గవర్నర్‌తో విచారణ జరిపించాలని జగన్‌ బాబాయ్‌ వైవీ సుబ్బారెడ్డి కోరడాన్ని ఆయన తప్పుబట్టారు.

read more news

జగన్ పై దాడి... రంగంలోకి కేంద్ర దర్యాప్తు బృందం

జగన్‌‌పై దాడి: హైకోర్టుకెక్కిన వైసీపీ

ఎపి పోలీసులపై నాకు నమ్మకం లేదు: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం