Asianet News TeluguAsianet News Telugu

సూరి హత్యకు భాను కిరణ్ ప్లాన్ ఇదీ...

 మద్దెల చెరువు సూరిని భానుకిరణ్ పక్కా ప్రణాళికతోనే హత్య చేసినట్లు సిఐడీ విచారణలో వ్యక్తమైంది. తనను సూరి అవమానించాడనీ, మాటలతో వేధించాడనీ అంతేకాదు పలుమార్లు చంపేస్తానని బెదిరించాడని గత్యంతరం లేని పరిస్థితుల్లో సూరిని హత్య చెయ్యాల్సి వచ్చిందని భానుకిరణ్ పోలీసులకు వాంగ్మూలం సైతం ఇచ్చాడు.  
 

Bhanu Kiran's plan to kill Maddelachervu Suri
Author
Hyderabad, First Published Dec 19, 2018, 12:33 PM IST

హైదరాబాద్: మద్దెల చెరువు సూరిని భానుకిరణ్ పక్కా ప్రణాళికతోనే హత్య చేసినట్లు సిఐడీ విచారణలో వ్యక్తమైంది. తనను సూరి అవమానించాడనీ, మాటలతో వేధించాడనీ అంతేకాదు పలుమార్లు చంపేస్తానని బెదిరించాడని గత్యంతరం లేని పరిస్థితుల్లో సూరిని హత్య చెయ్యాల్సి వచ్చిందని భానుకిరణ్ పోలీసులకు వాంగ్మూలం సైతం ఇచ్చాడు.  

భాను కిరణ్ ను సూరి నిత్యం వేధింపులకు గురి చేసేవాడని చంపేస్తానని పదేపదే బెదిరించడంతో తట్టుకోలేకపోయిన భానుకిరణ్ తానే సూరిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఎప్పుడైతే సూరిని అంతమెుందించాలని భావించాడో వెంటనే హత్యకు పక్కా ప్లాన్ వేశాడు. 

సూరిని అంతమెుందించేందుకు లైసెన్స్డే  రివాల్వర్ ను కొనుగోలు చేశాడు. కంట్రీమేడ్ పిస్టల్స్ సరిగ్గా పనిచేస్తాయో లేదో అని అనుమానించిన భానుకిరణ్  మన్మోహన్ సింగ్ బదారియా అనే వ్యక్తి దగ్గర లైసెన్స్ డ్ 0.32 రివాల్వర్ ను కొనుగోలు చేశాడు. అదే కంట్రీమేడ్ గన్ తో సూరిని భానుకిరణ్ పాయింట్ బ్లాంక్ రేంజ్ లో హత్య చేశాడు. 

పాయింట్ బ్లాంక్ రేంజ్ లో షూట్ చెయ్యడం వల్లే సూరి చనిపోయాడని వైద్యులు కూడా నిర్ధారించారు. అయితే భానుకిరణ్ వాడిన రివాల్వర్ 0.32లైసెన్సెడ్ రివాల్వర్ అని ఫోరెన్సిక్ నివేదికలో పొందుపరిచింది.

భానుకిరణ్ కు తుపాకీ అమ్మిన మన్మోహన్ సింగ్ బదారియా కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అతనికి కూడా నాంపల్లి కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష రూ.5వేలు  జరిమానా విధించింది. భానుకిరణ్ కు జీవిత ఖైదు విధించింది. 

భానుకిరణ్ సూరినిహత్య చెయ్యాలని నిర్ధారించుకున్న తర్వాత తన కుటుంబ సభ్యులను బెంగళూరు పంపించి వేశాడు. సూరిని తాను హత్య చేసిన అనంతరం వాళ్ల బంధువులు కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తాడన్న భయంతో పంపించి వేశాడు. అయితే తన అనుచరుడు మన్మోహన్ సింగ్ బదారియాను మాత్రం వదల్లేదు. మన్మోహన్ సింగ్ బదారియా హత్యకు ముందు నుంచి రెండు రోజులపాటు సూరిని వెంబడిస్తూనే ఉన్నాడు. 

అయితే హత్య రోజు మద్దెల చెర్వు సూరి నివాసం ఉంటున్న మాదాపూర్ లోని అలేఖ్య అపార్ట్మెంట్ లో కార్ పార్కింగ్ వద్దకు రావాలని చెప్పాడు. కార్ పార్కింగ్ లో హత్యకు సంబంధించి పథకం రచించారు ఇద్దరు. కారులో ఉన్న కంట్రీమేడ్ గన్ ను తీసేసి ఆ గన్ స్థానంలో కొనుగోలు చేసిన 0.32 పిస్టల్ వదిలి వెళ్లాలని ఆదేశించాడు. 

సూరిని హత్య చేసిన అనంతరం పారిపోయేందుకు అందుబాటులో ఉండాలని భానుకిరణ్ మన్మోహన్ సింగ్ ను కోరాడు. బైక్ పై మూసాపేటలో ఉండాలని చెప్పాడు. తన ప్లాన్ ప్రకారం భానుకిరణ్ సూరిని తప్పుదారి పట్టించాడు. సనత్ నగర్ వైపు వెళ్దామని చెప్పాడు.

దారి మధ్యలో పరిటాల రవి హత్య కేసుకు సంబంధించి లాయర్ తో మాట్లాడారు. లాయర్ ను కలిసిన తర్వాత సూరి తిరిగి సనత్ నగర్ వైపు బయలు దేరాడు. మార్గ మధ్యలో యూసఫ్ గూడ దగ్గరలోని నవోదయ కాలనీ సమీపంలో సూరిని కారులోనే హత్య చేసి అనుకున్న ప్రకారం మన్మోహన్ సింగ్ బైక్ పై పారిపోయాడు.  
 

ఈ వార్తలు కూడా చదవండి

సూరి హత్య: భాను కిరణ్ తప్పించుకు తిరిగిన వైనం...

పరిటాల కుటుంబం కళ్లలో ఆనందం కోసమే: భానుపై భానుమతి సంచలనం

భానుకిరణ్‌కు జీవిత ఖైదు:భానుమతి అసంతృప్తి

భాను కిరణ్ గురించి మద్దెలచెర్వు సూరి భార్య ఏమన్నారంటే...

సూరి హత్యకేసు:భానుకిరణ్ కు జీవిత ఖైదు, నలుగురికి విముక్తి

 

Follow Us:
Download App:
  • android
  • ios