పరిటాల కుటుంబం కళ్లలో ఆనందం కోసమే: భానుపై భానుమతి సంచలనం
పరిటాల కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందం చూసేందుకు సూరిని భాను కిరణ్ హత్య చేసినట్టు సూరి భార్య భానుమతి ఆరోపించారు.
హైదరాబాద్: పరిటాల కుటుంబ సభ్యుల కళ్లలో ఆనందం చూసేందుకు సూరిని భాను కిరణ్ హత్య చేసినట్టు సూరి భార్య భానుమతి ఆరోపించారు.
బుధవారం నాడు భాను కిరణ్ కు జీవిత ఖైదు విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు విధించిన నేపథ్యంలో ఓ మీడియా ఛానెల్‌కు భానుమతి ఇంటర్వ్యూ ఇచ్చారు.
సూరి హత్య వెనుక పరిటాల కుటుంబం కుట్ర ఉందని ఆమె ఆరోపించారు. డబ్బుల కోసమే భాను కిరణ్ తన భర్తను హత్య చేశారని ఆమె ఆరోపించారు. జైల్లోనే సూరితో భాను కిరణ్ పరిచయమయ్యాడని చెప్పారు.కానీ భాను కిరణ్ ముందు నుండి తమకు పరిచయం లేదన్నారు.
సూరితో అత్యంత నమ్మకంగా ఉంటూనే ఆయనను హత్య చేశాడని ఆమె ఆరోపించారు. పరిటాల కుటుంబానికి తమ కుటుంబానికి మధ్య ఉన్న విభేధాల కారణంగానే భాను కిరణ్ సహాయంతో సూరిని హత్య చేయించారని ఆమె ఆరోపించారు. పదివేల కోసం కూడ హత్య చేసే చరిత్ర భానుదని ఆమె ఆరోపించారు. భానుకు ఉరిశిక్ష వేస్తే తనకు సంతృప్తి ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు.
సంబంధిత వార్తలు
భానుకిరణ్‌కు జీవిత ఖైదు:భానుమతి అసంతృప్తి
భాను కిరణ్ గురించి మద్దెలచెర్వు సూరి భార్య ఏమన్నారంటే...
సూరి హత్యకేసు:భానుకిరణ్ కు జీవిత ఖైదు, నలుగురికి విముక్తి