జగన్ పై దాడి చేసిన శ్రీనివాస రావు హర్షవర్ధన్ కు చెందిన విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ లో పనిచేస్తున్న విషయం తెలిసిందే. న్ఐఎకు విశాఖ సిట్ అధికారులు కూడా సహకరించడం లేదు.  ఈ నేపథ్యంలోనే హర్షవర్దన్ విచారణకు హాజరు కాలేదనే మాట వినిపిస్తోంది.

విశాఖపట్నం: విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమానికి, తెలుగుదేశం పార్టీ నాయకుడు హర్షవర్దన్ చౌదరి ఎన్ఐఎ విచారణకు హాజరు కాలేదు. జగన్ పై దాడి చేసిన శ్రీనివాస రావు హర్షవర్ధన్ కు చెందిన విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ లో పనిచేస్తున్న విషయం తెలిసిందే. 

కేసు విచారణ కోసం విశాఖలోని కైలాసగిరి పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ ప్రాంగణంలో ఎన్ఐఎ తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. ఎన్‌ఐఏ అధికారులు మూడు రోజులుగా సాక్షులను విచారిస్తున్నారు. 

దాడి జరిగిన సమయంలో అక్కడ ఉన్ వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను కూడా సాక్షులుగా పేర్కొంటూ ఎన్ఐఎ అధికారులు నోటీసులు పంపించారు.. వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పనిచేసే కృష్ణకాంత్, మాజీ కార్పొరేటర్‌ జియ్యాని శ్రీధర్‌ రెండు రోజులక్రితం విచారణకు హాజరయ్యారు.

నోటీసులందుకున్న మిగతా వైఎస్సార్‌సీపీ నేతలు కూడా రెండు రోజుల్లో విచారణకు హాజరవుతామని సమాచారమిచ్చారు. అయితే ఈ కేసులో కీలకంగా భావిస్తున్న హర్షవర్ధన్‌ చౌదరి మాత్రం కనిపించడం లేదని అంటున్నారు. ఈ నెల 15 తర్వాత విచారణకు హాజరుకావాలంటూ ఎన్‌ఐఏ అధికారులు ఆయన ఇంటికి నోటీసులు పంపించారు. గురువారం ఆయన విచారణకు హాజరు కావచ్చునని భావించారు.

గురువారం హర్షవర్ధన్‌ విచారణకు హాజరు కావచ్చునని ప్రచారం జరగడంతో పెద్దఎత్తున మీడియా ఎన్‌ఐఏ తాత్కాలిక కార్యాలయం వద్ద గుమిగూడింది. అయితే హర్షవర్ధన్‌ సహా రెస్టారెంట్‌లో పనిచేసే సిబ్బంది ఎవ్వరూ హాజరుకాలేదు. పైగా హర్షవర్ధన్‌ ఫోన్‌ స్విచ్చాఫ్‌ వచ్చింది.

ఒకటి, రెండు రోజులు చూసి అప్పటికీ హర్షవర్ధన్‌ విచారణకు రాకుంటే ఏం చేయాలో నిర్ణయిస్తామని ఎన్ఐఎ అధికారులు చెబుతున్నారు. జగన్ కేసులో ఎన్ఐఎ విచారణను ఆపాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టుకెక్కింది. ఎన్ఐఎకు విశాఖ సిట్ అధికారులు కూడా సహకరించడం లేదు. ఈ నేపథ్యంలోనే హర్షవర్దన్ విచారణకు హాజరు కాలేదనే మాట వినిపిస్తోంది.

సంబంధిత వార్తలు

జగన్‌పై దాడి కేసు: ఎన్ఐఏ విచారణను నిలిపివేయాలంటూ ఏపీ సర్కార్ పిటిషన్

జగన్‌ దాడి కేసులో కొత్త ట్విస్ట్: మొండికేస్తున్న సిట్

జగన్‌పై దాడి: ముగిసిన శ్రీనివాసరావు విచారణ

జగన్ పై దాడి కేసులో ఎన్ఐఎ విచారణ: శ్రీనివాసరావుకు ఆంధ్ర భోజనం

జగన్‌పై దాడి: శ్రీనివాసరావు రాసిన 24 పేజీల లేఖలో ఏముందంటే...

కత్తిదాడి: జగన్‌కు ఎన్ఐఏ నోటీసులు

జగన్ పై దాడి: 24 పేజీల లేఖపై ఆరా, లాక్కున్నారని శ్రీనివాస రావు

జగన్‌పై దాడి: జైల్లో 24 పేజీల లేఖ రాసుకొన్న శ్రీనివాసరావు

జగన్‌పై దాడి: గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేసేందుకే ఇలా...

జగన్‌పై దాడి: విశాఖకు శ్రీనివాసరావును తరలించనున్న ఎన్ఐఏ