విశాఖపట్టణం: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి కేసులో గురువారం నాడు మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. ఈ కేసును ఎన్ఐఏ‌కు ఆధారాలు ఇచ్చేందుకు సిట్ పోలీసులు నిరాకరించారు.ఈ విషయమై కోర్టులో  ఎన్ఐఏ  అధికారులు  పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసుకు సంబంధించి  ఆధారాలను ఇవ్వాల్సిందిగా విశాఖలోని సిట్ బృందాన్ని ఎన్ఐఏ అధికారులు కోరారు. అయితే ఈ  ఆధారాలు ఇచ్చేందుకు సిట్ అధికారులు నిరాకరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యంలోనే  ఈ పరిస్థితులు ఏర్పడి ఉంటాయని భావిస్తున్నారు.

కేసు దర్యాప్తులో భాగంగా ఆధారాలు అవసరమని భావించిన ఎన్ఐఏ కోర్టును ఆశ్రయించింది. సిట్ అధికారులు తమ వద్ద ఉన్న ఆధారాలు ఇవ్వడం లేదంటూ  ఎన్ఐఏ అధికారులు కోర్టులో గురువారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టులో వాదనలు సాగుతున్నాయి.

గత ఏడాది  అక్టోబర్ మాసంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో  వైసీపీ చీప్ వైఎస్ జగన్‌పై  శ్రీనివాసరావు  దాడికి పాల్పడ్డాడు.ఈ కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం  సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ కేసును సిట్ దర్యాప్తు చేసింది. అయితే ఈ కేసు దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే కేంద్రం ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించింది.

ఈ కేసును సిట్ విచారణ చేస్తున్న సమయంలో కేంద్రం జోక్యం చేసుకొని ఎన్ఐఏకు అప్పగించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ విషయమై మోడీకి బాబు లేఖ రాశారు. హైకోర్టులో కూడ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఎన్ఐఏ దర్యాప్తు చేయడం రాష్ట్రాల హక్కులను కాలరాయడమేనని ఏపీ సీఎం అభిప్రాయపడ్డారు.ఈ పరిణామాల నేపథ్యంలోనే సిట్ అధికారులు ఎన్ఐఏకు ఆధారాలు ఇవ్వడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

 

సంబంధిత వార్తలు

జగన్‌పై దాడి: ముగిసిన శ్రీనివాసరావు విచారణ

జగన్ పై దాడి కేసులో ఎన్ఐఎ విచారణ: శ్రీనివాసరావుకు ఆంధ్ర భోజనం

జగన్‌పై దాడి: శ్రీనివాసరావు రాసిన 24 పేజీల లేఖలో ఏముందంటే...

కత్తిదాడి: జగన్‌కు ఎన్ఐఏ నోటీసులు

జగన్ పై దాడి: 24 పేజీల లేఖపై ఆరా, లాక్కున్నారని శ్రీనివాస రావు

జగన్‌పై దాడి: జైల్లో 24 పేజీల లేఖ రాసుకొన్న శ్రీనివాసరావు

జగన్‌పై దాడి: గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేసేందుకే ఇలా...

జగన్‌పై దాడి: విశాఖకు శ్రీనివాసరావును తరలించనున్న ఎన్ఐఏ