వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ విచారణ సమయంలో కొన్ని కీలక విషయాలు వెలుగు చూసినట్టు తెలుస్తోంది.


విశాఖపట్టణం: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ విచారణ సమయంలో కొన్ని కీలక విషయాలు వెలుగు చూసినట్టు తెలుస్తోంది.

జగన్ పై దాడి కేసు విషయమై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం నాడు సీన్ రీ కన్‌స్ట్రక్షన్స్ చేయనున్నారు. గర్ల్‌ఫ్రెండ్స్ ను ఇంప్రెస్ చేసేందుకు శ్రీనివాసరావు జగన్‌పై దాడి చేశారని ఎన్ఐఏ విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది.

 శ్రీనివాసరావు చెప్పిన విషయాలపై ఎన్ఐఏ విచారణ చేయనుంది. శ్రీనివాసరావు గర్ల్‌ఫ్రెండ్స్ ను కూడ విచారించనున్నారు.మంగళవారం నాడు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీనివాసరావుతో ఎన్ఐఏ సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయనుంది.

గత ఏడాది అక్టోబర్ మాసంలో విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్ పై శ్రీనివాసరావు దాడికి పాల్పడ్డారు. ఈ కేసును ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించింది. ఈ కేసును ఎన్ఐఏ కు అప్పగించడంపై ఏపీ సర్కార్ అసంతృప్తిని వ్యక్తం చేసింది.ఈ విషయమై చంద్రబాబునాయుడు మోడీకి లేఖ రాసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

జగన్‌పై దాడి: విశాఖకు శ్రీనివాసరావును తరలించనున్న ఎన్ఐఏ