Asianet News TeluguAsianet News Telugu

జగన్‌పై దాడి: శ్రీనివాసరావు రాసిన 24 పేజీల లేఖలో ఏముందంటే...

 జైల్లో ఉన్న సమయంలో  శ్రీనివాసరావు రాసిన 24 పేజీల లేఖలో ఏముందనే  విషయమై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ లేఖను ఇప్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ కూడ దాఖలు చేయనున్నామని శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం చెబుతున్నారు.

what is the content in srinivasa rao 24 pages letter
Author
Amaravathi, First Published Jan 16, 2019, 4:52 PM IST


హైదరాబాద్: జైల్లో ఉన్న సమయంలో  శ్రీనివాసరావు రాసిన 24 పేజీల లేఖలో ఏముందనే  విషయమై సర్వత్రా ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఈ లేఖను ఇప్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ కూడ దాఖలు చేయనున్నామని శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం చెబుతున్నారు.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై గత ఏడాది అక్టోబర్ మాసంలో శ్రీనివాసరావు అనే యువకుడు విశాఖ ఎయిర్‌పోర్టులో  కత్తితో దాడికి పాల్పడ్డాడు.  ఈ దాడి  తర్వాత ఏపీ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు పూర్తైన తర్వాత విశాఖ జైల్లో  శ్రీనివాసరావు రిమాండ్‌లో ఉన్నారు.

రిమాండ్‌లో ఉన్న సమయంలో  శ్రీనివాసరావు  24 పేజీల లేఖను రాసుకొన్నారు. ఈ లేఖ కావాలని శ్రీనివాసరావు భావిస్తున్నారు. ఈ లేఖను చూసిన జైలు అధికారులు శ్రీనివాసరావును నుండి  తీసుకొన్నారని శ్రీనివాసరావు తరపు న్యాయవాది సలీం చెబుతున్నారు.

వైసీపీ మెనిఫెస్టో ఎలా ఉండాలనే విషయమై ఈ 24 పేజీల లేఖలో శ్రీనివాసరావు రాసుకొన్నారని  సలీం చెప్పారు. ఏఏ అంశాలు మేనిఫెస్టోలో ఉండాలనే దానిపై ప్రధానంగా ప్రస్తావించినట్టు సలీం అభిప్రాయపడుతున్నారు.

విద్య, వైద్యం తో పాటు రైతాంగం సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉండాలనే అంశాలను శ్రీనివాసరావు ఈ లేఖలో ప్రస్తావించినట్టు చెబుతున్నారు. రైతులకు ఏ రకమైన కార్యక్రమాలు ఉండాలనే విషయాన్ని  ఈ లేఖలో ప్రస్తావించారు.

సంబంధిత వార్తలు

కత్తిదాడి: జగన్‌కు ఎన్ఐఏ నోటీసులు

జగన్ పై దాడి: 24 పేజీల లేఖపై ఆరా, లాక్కున్నారని శ్రీనివాస రావు

జగన్‌పై దాడి: జైల్లో 24 పేజీల లేఖ రాసుకొన్న శ్రీనివాసరావు

జగన్‌పై దాడి: గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేసేందుకే ఇలా...

జగన్‌పై దాడి: విశాఖకు శ్రీనివాసరావును తరలించనున్న ఎన్ఐఏ

 

Follow Us:
Download App:
  • android
  • ios