హైదరాబాద్: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి ఘటనపై మంగళవారం నాడు నాలుగో రోజు విచారణను ఎన్ఐఏ కొనసాగించింది. జగన్‌పై దాడికి పాల్పడిన శ్రీనివాసరావు సెంట్రల్ జైల్లో రాశాడు. ఈ లేఖను జైలు అధికారులు బలవంతంగా లాక్కొన్నారని నిందితుడు సలీం చెప్పారు.

జగన్‌పై దాడి ఘటనకు సంబంధించిన విషయమై నాలుగు రోజులుగా శ్రీనివాసరావును ఎన్ఐఏ విచారణ చేస్తున్నారు. ఇంకా మిగిలిన మూడు రోజులు కూడ ఎన్ఐఏ  హైద్రాబాద్‌లోనే విచారణ చేయనున్నారు.

నిందితుడిని విశాఖకు తరలించబోరని నిందితుడి తరపున న్యాయవాది సలీం అభిప్రాయపడ్డారు. నిందితుడు శ్రీనివాసరావు ఆరోగ్యంగా ఉన్నారని చెబుతున్నారు. జైల్లో ఉన్న సమయంలో శ్రీనివాసరావు 24 పేజీల లేఖను రాసుకొన్నారు.

ఈ  లేఖను జైలు అధికారులు తీసుకొన్నారని సలీం చెప్పారు. ఈ లేఖ కోసం న్యాయపరంగా ప్రయత్నాలు చేస్తామన్నారు. మరోవైపు శ్రీనివాసరావును సోమవారం నాడు ఎన్ఐఏ డీఐజీ, మంగళవారం నాడు ఎన్ఐఏ ఎస్పీ విచారించారు. 

జగన్ పై దాడి వెనుక ఎవరున్నారనే విషయమై బయటపెట్టేందుకు ఎన్ఐఏ ప్రయత్నిస్తోంది. అయితే సిట్ విచారణలో చెప్పినట్టుగానే శ్రీనివాసరావు సమాధానాలు చెబుతున్నాడని సలీం చెప్పారు.కస్టడీ ముగిసిన వెంటనే శ్రీనివాసరావును విజయవాడ కోర్టులో హాజరుపర్చనున్నారు.

సంబంధిత వార్తలు

జగన్‌పై దాడి: గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేసేందుకే ఇలా...

జగన్‌పై దాడి: విశాఖకు శ్రీనివాసరావును తరలించనున్న ఎన్ఐఏ