హైదరాబాద్: వైసీపీ చీఫ్  వైఎస్ జగన్‌పై దాడికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావును  ఎన్ఐఏ‌ అధికారులు మంగళవారం నాడు విశాఖపట్టణానికి తీసుకెళ్లనున్నారు. విశాఖలో జగన్‌పై దాడి ఘటనకు సంబంధించి సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌ చేయనున్నారు.

గత ఏడాది అక్టోబర్ మాసంలో  వైసీపీ చీఫ్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీనివాసరావు అనే యువకుడు దాడికి పాల్పడ్డాడు.ఈ కేసులో కోర్టు అనుమతితో ఎన్ఐఏ శ్రీనివాసరావును ఎన్ఐఏ  అధికారులు  తమ కస్టడీలోకి తీసుకొన్నారు.

శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు సోమవారం నాడు విచారణ ముగించారు. మూడో రోజు కూైడ విచారణ ముగిసింది. న్యాయవాది సమక్షంలోనే  శ్రీనివాసరావును ఎన్ఐఏ అధికారులు విచారించారు.  శ్రీనివాసరావు స్టేట్‌మెంట్‌ను ఎన్ఐఏ అధికారులు  సేకరించారు.

మంగళవారం నాడు ఎన్ఐఏ అధికారులు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు  శ్రీనివాసరావును తీసుకెళ్లనున్నారు.  ఎయిర్‌పోర్ట్‌లో జగన్ పై దాడి ఘటనను సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

వైజాగ్ సేఫ్ కాదు: శ్రీనివాసరావు తరలింపుపై లాయర్‌కు సమాచారం