ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై దాడి కేసు మరో కీలక మలుపు తిరిగింది.  నిందితుడు శ్రీనివాస్ కి ప్రాణ హాని ఉందని వస్తున్న వార్తలపై వివరణ కోరుతూ జాతీయ ఎస్సీ కమిషన్ రంగంలో దిగింది.  ఈ మేరకు ఏపీ డీజీపీ, విశాఖ పోలీసు కమిషనర్ కు జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీచేసింది.

నిందితుడు శ్రీనివాస్ కి ప్రాణహాని ఉందని వస్తున్న వార్తలపై వివరణ కోరింది. దీనిపై 30రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీచేసింది. ఇదిలా ఉంటే.. నిందితుడు శ్రీనివాసరావు కస్టడీ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో కస్టడీ పొడిగిస్తారా..? విచారణ ముగిసిందని తేలుస్తారో తెలియాల్సి ఉంది. 

గత ఐదు రోజులుగా నిందితుడిని విచారిస్తున్న పోలీసులు.. అతని నుంచి కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు అతను సమాధానం చెప్పినట్లు సమాచారం. కాగా.. శ్రీనివాసరావు చెప్పిన ప్రతిమాటను పోలీసులు రికార్డ్ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు చదవండి

జగన్‌పై దాడి: శ్రీనివాసరావుకు లైడిటెక్టర్ పరీక్ష..?

జగన్‌పై దాడి: ఆ నలుగురితో శ్రీనివాసరావు సంభాషణ

జగన్‌పై దాడి: ఇద్దరు గుంటూరు మహిళల విచారణ

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ