తనపై విశ్వాసం ఉంచి డీజీపీగా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మకాన్ని వమ్ము చేయను అన్నారు ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీ ఆర్పీ ఠాకూర్. డీజీపీ నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందిన తర్వాత ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం లభించిందన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అవినీతి పరుల ఆస్తులను ప్రభుత్వపరం చేసేందుకు కొత్త చట్టం బాగా ఉపయోగపడుతుందని.. దీని సాయంతో రాష్ట్రంలో అవినీతిని అంతం చేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ చర్యలతో అవినీతి నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్ స్థానం మెరుగుపడిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించినన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తానని డీజీపీ అన్నారు.