ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకుడు రేపు డిల్లీకి  వెళ్లనున్నారు. ఏపి ప్రభుత్వంపై ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ వ్యవహరిస్తున్న తీరుపై ఫిర్యాదు చేయడానికే సీఎం హఠాత్తుగా డిల్లీకి పయనమైనట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో గవర్నర్ తీరుపై గళమెత్తడానికి సీఎం ఈ పర్యటన చేపట్టారని సమాచారం.

రేపు మధ్యాహ్నం 3 గంటలకు డిల్లీలోనే జాతీయ మీడియాతో చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆయన ఈ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతారన్న దానిపై రాజకీయంగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.    

ఏపి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పై గురువారం హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై నిన్న రాత్రి మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు గవర్నర్ నరసింహన్ తీరును తప్పుబట్టారు. 

చంద్రబాబు డిల్లీలో అందుబాటులో వున్న జాతీయ పార్టీ నేతల్ని కలవనున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని రాజకీయ పరిణామాలు, పార్టీల పోకడలపై డిల్లీలో  చంద్రబాబు మాట్లాడనున్నారు. 

ప్రస్తుతం గవర్నర్ నరసింహన్ కూడా డిల్లీ పర్యటనలోనే వున్నారు. ఇవాళ ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ సమయంలో చంద్రబాబు డిల్లీయ పర్యటనపై ప్రకటన చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.  

సంబంధిత వార్తలు

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ