అమరావతి: రాజధాని భూముల విషయంలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై  విచారణ చేస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.   సోమవారం నాడు  ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశాల మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పందించారు.

Also read:ఏపీ అసెంబ్లీ: టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం

 స్పీకర్ ఆదేశాలను కచ్చితంగా పాటిస్తామని   సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.  సీఎం వైఎస్ జగన్ స్పీకర్ ఆదేశాలను పాటిస్తామని ప్రకటించి కూర్చోగానే మంత్రి బొత్స సత్యనారాయణ ఈ విషయమై మాట్లాడారు. ఇదే సమయంలో స్పీకర్ గా  తాను విచారణ కోరే హక్కు ఉందా లేదా చెప్పాలని స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రి  బొత్స సత్యనారాయణను ప్రశ్నించారు.

Also read:విశాఖలో నాకు ఒక్క ఎకరం ఉన్నట్టు నిరూపించాలి: మంత్రి బొత్స సవాల్,

Also read:ఇది బ్లాక్ డే, అమరావతిని నిలుపుకొంటాం: చంద్రబాబు కామెంట్స్

స్పీకర్ గా  మీకు ప్రభుత్వాన్ని  ఆదేశించే హక్కుందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.  దోషులెవరో కచ్చితంగా  తేలాల్సిన అవసరం ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. చంద్రబాబునాయుడు లాంటి వ్యక్తి విపక్షనేతగా ఉండడం తాము బాధపడుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

also read:ఆ రెండు బిల్లులకు వ్యతిరేకించాలి: రాపాక వరప్రసాద్‌కు పవన్ లేఖ

Also read:పవన్‌కు షాక్: జగన్‌కు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే రాపాక

also read:తెలంగాణ పరిస్థితి రాకూడదనే ఉద్దేశ్యంతోనే....: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

 రాజధాని భూములపై  సమగ్ర విచారణ జరిగితే  దోషులెవరో తేలుతుందని చెప్పారు.  ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపించాలని సవాల్ చేసిన  చంద్రబాబు నాయుడు విచారణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. తననే డిక్టేట్ చేస్తారా అని స్పీకర్  తమ్మినేని సీతారాం ప్రశ్నించారు.  ఈ సమయంలో టీడీపీ సభ్యులపై స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.