అమరావతి: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై సోమవారం నాడు అసెంబ్లీలో తీవ్రంగా మండిపడ్డారు.

Also read:విశాఖలో నాకు ఒక్క ఎకరం ఉన్నట్టు నిరూపించాలి: మంత్రి బొత్స సవాల్,

సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాల్లో  రాజధాని భూముల  విషయంలో చోటు చేసుకొన్న విషయంలో  పలువురు సభ్యులు లేవనెత్తిన అంశాలపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు.

Also read:ఇది బ్లాక్ డే, అమరావతిని నిలుపుకొంటాం: చంద్రబాబు కామెంట్స్

సభలో ఉన్న వారితో పాటు సభలో లేని వారి పేర్లు కూడ బయటకు వచ్చిన విషయాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం గుర్తు చేశారు. ఈ విషయమై  సమగ్ర విచారణ  చేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కోరారు.

also read:ఆ రెండు బిల్లులకు వ్యతిరేకించాలి: రాపాక వరప్రసాద్‌కు పవన్ లేఖ

Also read:పవన్‌కు షాక్: జగన్‌కు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే రాపాక

ఈ సమయంలో సీఎం జగన్  స్పందించే లోపుగానే టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కూడ స్పందించారు. టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు  ఈ విషయమై విచారణ చేయాలని ఎలా అడుగుతారని స్పీకర్‌ను అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

also read:టీడీపీ నేతలు కొనుగోలు చేసిన భూములివే: అసెంబ్లీలో బయటపెట్టిన మంత్రి బుగ్గన

ఈ విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. తనకు ఉన్న హక్కు మేరకే తాను  ఈ విషయమై సమగ్ర విచారణ చేయాలని కోరుతున్నట్టుగా  స్పీకర్  తమ్మినేని సీతారాం చెప్పారు.

also read:తెలంగాణ పరిస్థితి రాకూడదనే ఉద్దేశ్యంతోనే....: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

ఈ విషయమై తమ్మినేని సీతారాం,  టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ హద్దులు దాటి నీవు ప్రవర్తించకూడదని అచ్చెన్నాయుడుపై స్పీకర్  తమ్మినేని సీతారాం మండిపడ్డారు.