అమరావతి :విశాఖను రాజధానిని చేయాలని  తాము కోరుకొంటున్నామని  ఏపీ రాష్ట్ర మంత్రి బొత్స సత్యానారాయణ  చెప్పారు. విశాఖలో తనకు గానీ తన కుటుంబానికి ఒక్క ఎకరం భూమి ఉన్నట్టు నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు.

సోమవారం నాడు ఏపీ అసెంబ్లీలో పాలనా వీకేంద్రీకరణ బిల్లుపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు.  ఈ సందర్భంగా సమయం దొరికినప్పుడల్లా  మంత్రి బొత్స సత్యనారాయణ  టీడీపీపై వమర్శలు గుప్పించారు.  

అభివృద్ది అంటే ఐదు కోట్ల మందికి చెందాల్సిన అవసరం ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. అభివృద్ది ఫలాలు అందరికీ దక్కాలన్నారు. జీఎన్ రావు, బోస్టన్ కమిటీ నివేదికలు ఇచ్చినట్టుగా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.రైతుల ముసుగులో విపక్షాలు శాంతిభద్రతలకు విఘాతం కల్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

రాష్ట్రంలోని  13 జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నారని చెప్పారు.  2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీసుకొన్న నిర్ణయాల వల్ల  అంతో కొంత పంటలు పడుతున్నాయని మంత్రి బొత్స సత్యానారాయణ చెప్పారు.  

ఇది బ్లాక్ డే, అమరావతిని నిలుపుకొంటాం: చంద్రబాబు కామెంట్స్

విజయనగరం ప్రాంతంలో అభివృద్ధి అక్కర లేదా అని  మంత్రి ప్రశ్నించారు.  విశాఖలో నాకు గానీ ఒక్క ఎకరం భూమి ఉన్నా నిరూపించాలని మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు.

also read:ఆ రెండు బిల్లులకు వ్యతిరేకించాలి: రాపాక వరప్రసాద్‌కు పవన్ లేఖ

Also read:పవన్‌కు షాక్: జగన్‌కు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే రాపాక

 గత ఐదేళ్ల పాటు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడని.. తాను భూ ఆక్రమణలకు పాల్పడితే ఏం చేశారో చెప్పాలని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఏ రకంగా దోచుకోవాలో మాకు తెలియదని మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ నేతలపై సెటైర్లు వేశారు.తాము విశాఖపట్టణం రాజధానికి అనుకూలంగా ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.

విశాఖలో రాజధానిని చేస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతోందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.  ఐదేళ్లపాటు చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేసిందో చెప్పాలని  ఆయన డిమాండ్ చేశారు.

also read:టీడీపీ నేతలు కొనుగోలు చేసిన భూములివే: అసెంబ్లీలో బయటపెట్టిన మంత్రి బుగ్గన

ఉమ్మడి రాష్ట్ర విభజన కోసం అనుకూలంగా చంద్రబాబునాయుడు లేఖ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ  సమయంలో అచ్చెన్నాయుడు, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రసంగానికి పదే పదే అడ్డు తగిలే ప్రయత్నం చేశారు.  

also read:తెలంగాణ పరిస్థితి రాకూడదనే ఉద్దేశ్యంతోనే....: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

ఈ సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ,  టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. ఇదే సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ  తన ప్రసంగాన్ని ముగించారు.