MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Andhra Pradesh
  • Andhra pradesh: పెళ్లి పీట‌ల‌పై కాబోయేవాడు, ముందు ప్రేమించిన వాడు.. సినిమాని మించిన ట్విస్ట్

Andhra pradesh: పెళ్లి పీట‌ల‌పై కాబోయేవాడు, ముందు ప్రేమించిన వాడు.. సినిమాని మించిన ట్విస్ట్

Andhra pradesh: పెద్దల మాట విని ముందు పెళ్లికి ఒప్పుకుంటారు, ఆ తర్వాత ప్రేమించనవాడు కనిపించగానే పెళ్లి పీటలపై నుంచి వెళ్లిపోతారు. ఇలాంటి సంఘటనలు ఎక్కువగా సినిమాల్లో కనిపిస్తాయి కదూ! అయితే ఈ సంఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిజంగా జ‌రిగింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Mar 08 2026, 09:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెళ్లి మండపంలో అనూహ్య ఘ‌ట‌న
Image Credit : Gemini AI

పెళ్లి మండపంలో అనూహ్య ఘ‌ట‌న

మంగళ వాయిద్యాల నడుమ పెళ్లి వేడుక సందడిగా సాగుతోంది. పురోహితుడు మంత్రాలు చదువుతుండగా బంధువులు ఆనందంగా పెళ్లిని వీక్షిస్తున్నారు. ముహూర్తం సమయం దగ్గరపడడంతో వధూవరులకు జీలకర్ర–బెల్లం కార్యక్రమం కూడా పూర్తయింది. ఇక కొద్దిసేపట్లో తాళి కట్టే ముఖ్య ఘట్టం జరగబోతుందని అందరూ ఎదురుచూస్తుండగా… ఒక్కసారిగా జరిగిన సంఘటన అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
మండపానికి వచ్చిన యువకుడు
Image Credit : Gemini AI

మండపానికి వచ్చిన యువకుడు

తాళికట్టే వేళ దగ్గరపడుతుండగా ఓ యువకుడు హడావుడిగా పెళ్లి మండపం వద్దకు చేరుకున్నాడు. అతడిని చూసిన వెంటనే వధువు ఆశ్చర్యకరంగా స్పందించింది. పెళ్లి పీటలపై కూర్చున్న ఆమె ఒక్కసారిగా లేచి మండపం దిగింది. “వచ్చావా…” అంటూ ఆ యువకుడి వద్దకు వెళ్లి నిలబడింది. ఈ ఘటనతో అక్కడున్నవారంతా క్షణాల్లో ఆశ్చర్యానికి గురయ్యారు. పెళ్లి జరుగుతున్న వరుడు, అతని కుటుంబసభ్యులు ఈ పరిణామంతో పూర్తిగా షాక్‌కు గురయ్యారు.

35
ప్రేమ వ్యవహారం బయటపెట్టిన వధువు
Image Credit : Gemini AI

ప్రేమ వ్యవహారం బయటపెట్టిన వధువు

వధువు చర్యను చూసి బంధువులు వెంటనే ఆమెను ప్రశ్నించారు. అప్పుడు ఆమె అసలు విషయాన్ని బయటపెట్టింది. “ఈ యువకుడు మా ఊరువాడే. మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించుకున్నాం. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు” అంటూ స్పష్టంగా చెప్పింది. దీంతో అక్కడ ఉన్నవారందరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో పెద్ద చర్చకు దారి తీసింది.

45
ఉద్రిక్తత… పోలీసుల జోక్యం
Image Credit : Gemini AI

ఉద్రిక్తత… పోలీసుల జోక్యం

వధువు మాటలు విన్న వెంటనే వరుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి నిమిషంలో వచ్చి పెళ్లి చెడగొట్టాడంటూ యువకుడిపై కొందరు దాడి చేయడానికి కూడా ప్రయత్నించారు. అక్కడ పరిస్థితి క్రమంగా ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ కలకలం కారణంగా పెళ్లి కార్యక్రమం అక్కడికక్కడే ఆగిపోయింది.

55
వరుడి కుటుంబం ఆవేదన
Image Credit : Gemini AI

వరుడి కుటుంబం ఆవేదన

ఈ ఘటనతో వరుడి తల్లిదండ్రులు త‌మ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. “మాకు ఒక్కగానొక్క కుమారుడు. అతని పెళ్లిని ఘనంగా జరపాలని చాలా ఏర్పాట్లు చేశాం. బంధువులందరినీ పిలిచాం. దాదాపు రూ.20 లక్షలు ఖర్చు చేశాం. విందు కోసం భారీ ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే వేల మంది భోజనం చేశారు. ఇంత జరుగుతున్న సమయంలో పెళ్లిని మధ్యలో ఆపేయడంతో అందరి ముందు మా పరువు పోయింది” అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామ పెద్దల పంచాయితీతో పరిష్కారం

ఈ ఘటన తర్వాత ఇరువైపుల కుటుంబాలు గ్రామ పెద్దల సమక్షంలో సమావేశమయ్యాయి. శనివారం జరిగిన పంచాయితీలో విషయం చర్చించి సమస్యను పరిష్కరించుకున్నారు. అయితే పెళ్లి మండపంలో చోటుచేసుకున్న ఈ అనూహ్య పరిణామం మాత్రం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రేమ, కుటుంబ నిర్ణయాలు, సామాజిక ఒత్తిడుల మధ్య జరిగే సంఘర్షణకు ఈ సంఘ‌ట‌న ఉదాహ‌ర‌ణ‌గా నిలిచింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
వైరల్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
NO విడాకులు.. NO డౌట్స్! | TDP - Janasena Alliance News | Asianet News Telugu
Recommended image2
Now Playing
లోకేష్ ని ఆటపట్టిస్తున్న పిల్లలు | Nara Lokesh | Asianet News Telugu
Recommended image3
Now Playing
😂 Student Hilarious Reply To Nara Lokesh |లోకేష్ కే పంచు వేసిన బుడ్డోడు | Asianet News Telugu
Related Stories
Recommended image1
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారి మ‌న‌సు చాలా క‌ఠినం.. అందుకే ఎక్కువ‌ మందికి దూర‌మ‌వుతారు
Recommended image2
Viral Video: ఇదెక్క‌డి మాస్‌రా మామా.. బీరు బాటిల్లో చేప పిల్ల‌. ఎలా వ‌చ్చింద‌బ్బా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved