అమరావతి:  ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన  సీఆర్‌డీఏ రద్దు బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకించాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోమవారం నాడు   ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు సోమవారం నాడు లేఖ రాశారు.

Also read:పవన్‌కు షాక్: జగన్‌కు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే రాపాక

సోమవారం నాడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం  సీఆర్‌డీఏ రద్దు బిల్లు, పాలనా వికేంద్రీకరణ బిల్లులను  అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లులను మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణలు ప్రవేశపెట్టారు.

ఈ  సందర్భంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సోమవారం నాడు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద‌కు లేఖ రాశారు.ఈ రెండు బిల్లులను వ్యతిరేకించాలని కోరారు.

మూడు రాజధానుల ప్రతిపాదనను జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ కారణంగానే ఈ రెండు బిల్లును వ్యతిరేకించాలని ఆ పార్టీ ఎమ్మెల్యేకు  రాపాక వరప్రసాద్‌ను ఆదేశించారు పవన్ కళ్యాణ్.

ఇదిలా ఉంటే  మూడు రాజధానులకు తాను అనుకూలమని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఆదివారం నాడు స్పష్టం చేశారు. మూడు రాజధానుల విషయంలో   అసెంబ్లీలో ఓటింగ్ జరిగితే తాను మూడు రాజధానులకు అనుకూలంగా ఓటు చేస్తానని రాపాక వరప్రసాద్ ఇప్పటికే ప్రకటించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో  సోమవారం నాడు పవన్ కళ్యాణ్ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకొంది.  అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఏ రకంగా వ్యవహరిస్తారనేది ప్రస్తుతం ఆసక్తిగా మారింది.