అమరావతి: ఏపీ రాజధాని అమరావతిని నిలబెట్టుకొంటామని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఇవాళ ఏపీ చరిత్రలో బ్లాక్ డే గా చంద్రబాబునాయుడు అభివర్ణించారు.

Also read:సీఆర్డీఎ రద్దు, పాలన వికేంద్రీకరణ బిల్లులకు జగన్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

సోమవారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీకి పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబునాయుడు ర్యాలీగా బయలుదేరారు. 

రాజధాని రచ్చ: ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు బంద్

Also read:పవన్‌కు షాక్: జగన్‌కు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే రాపాక

ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని చంద్రబాబునాయుడు విమర్శించారు. అన్నిపార్టీలు,. ఐదు కోట్ల ప్రజలకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలు చేస్తూ అప్రకటిత వాతావరణం ఏర్పాటు చేశారని చంద్రబాబునాయుడు విమర్శించారు. ఎక్కడికక్కడే  అరెస్ట్‌లు చేశారని చంద్రబాబు విమర్శించారు.

 జగన్ తీసుకొన్న నిర్ణయాలను చంద్రబాబునాయుడు తప్పుబట్టారు. జగన్ ఏకపక్షంగా తీసుకొన్న నిర్ణయాలను ప్రజలు తిప్పికొట్టాలని ఆయన కోరారు.. రాత్రి నుండి ఎక్కడికక్కడే అరెస్ట్‌లు జరుగుతున్న విషయాన్ని చంద్రబాబునాయుడు గుర్తు చేశారు.