పవన్‌కు షాక్: జగన్‌కు జై కొట్టిన జనసేన ఎమ్మెల్యే రాపాక
జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మూడు రాజధానుల అంశానికి మద్దతుగా మాట్లాడారు. అసెంబ్లీలో ఓటింగ్ జరిగితే తాను మూడు రాజధానులకు అనుకూలంగా ఓటు వేస్తానని ప్రకటించారు.
అమరావతి:జనసేనకు చెందిన ఏకైక ఎమ్మెల్యే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నిర్ణయాన్ని ప్రకటించారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని జనసేన తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
కానీ, జనసేనకు చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాత్రం సీఎం జగన్ నిర్ణయానికి జై కొడుతానని స్పష్టం చేశారు. రాపాక వరప్రసాద్ ప్రకటన ప్రస్తుం రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. కొంత కాలంగా పార్టీ నిర్ణయానికి భిన్నంగా రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలు చేస్తున్నారు. రాపాక వరప్రసాద్ వైసీపీలో చేరుతారనే ప్రచారం కొంత కాలంగా సాగుతోంది.
Also read@బీజేపీ, జనసేన పొత్తుపై చంద్రబాబు ఏమన్నారంటే....
సోమవారం నాడు ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో చర్చించనున్నారు. హైపవర్ కమిటీ నివేదిక, బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ నివేదికలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
Also read:డ్యాన్స్ లు చేస్తే... నా ముందు దిగదుడుపే: పవన్ పై కేఏ పాల్, జగన్ కు బాసట
ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో మూడు రాజధానుల అంశంపై చర్చ జరిగితే అందుకు అనుకూలంగా చర్చలో పాల్గొంటానని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ స్పష్టం చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై ఓటింగ్ జరిగితే అనుకూలంగా ఓటు వేస్తానని ఆయన తేల్చి చెప్పారు.
also read:రాజధాని రచ్చ: మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సహా పలువురు నేతల హౌస్ అరెస్ట్
రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేందుకు, పరిపాలనా వికేంద్రీకరణ పరంగానూ ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నెల 20వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.ఈ సమావేశంలో అమరావతి విషయాన్ని ఏపీ సర్కార్ తేల్చనుంది. మూడు రాజధానుల వైపే జగన్ సర్కార్ మొగ్గు చూపేలా సంకేతాలు ఇస్తోంది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని జగన్ సర్కార్ తీసుకొన్న నిర్ణయాన్ని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయమై జగన్ పై పవన్ విమర్శలు చేశారు. ఈ విమర్శలపై జగన్ కూడ ఘాటుగానే స్పందించారు.ఈ విషయంలో పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు వ్యక్తిగత విమర్శలకు కూడ దిగారు.
ఇంగ్లీష్ మీడియం ప్రతిపాదనకు రాపాక వరప్రసాద్ అనుకూలంగా మాట్లాడారు. మూడు రాజధానులకు కూడ జగన్ అనుకూలంగా మాట్లాడడం కూడ చర్చకు దారి తీస్తోంది. కాకినాడలో జనసేన కార్యకర్తలను పవన్ కళ్యాణ్ పరామర్శ సమయంలో రాపాక వరప్రసాద్ పాల్గొనలేదు.