శ్రీకాకుళం: మాజీ ప్రభుత్వ విప్ కూన రవికుమార్ కేసు విషయంలో  తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. కూన రవికుమార్ పై కేసులు పెట్టింది ఎన్జీవోలు అయితే తనకు ఎందుకు సంబంధం అంటగడతారని ప్రశ్నించారు. 

సభాపతిగా తనకు సంబంధం లేదని చెప్పినప్పటికీ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ విమర్శించారు. బాధ్యతగల స్థానంలో ఉన్నప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని ప్రస్తుతం తాను అలానే నడుచుకుంటున్నట్లు తెలిపారు. 

ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కూన రవికుమార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆడియో, వీడియోలు ఉన్నాయని అందుకే వారు కేసు పెట్టారని స్పష్టం చేశారు. ఉద్యోగులకు ఆత్మగౌరవం ఉంటుందని వాళ్ల పని వాళ్లను చేసుకోనివ్వాలని వ్యాఖ్యానించారు. 

తన వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసునని ఇకనైనా ఆరోపణలు విరమించుకోవాలని సూచించారు. తనపై  ఆరోపణలు చేసిన మాజీమంత్రి అచ్చెన్నాయుడు క్రిమినల్ రికార్డులు బయటకు తీయాలని పోలీసులను ఆదేశించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. 

అధికార్లను బెదిరించిన చరిత్ర అచ్చెన్నాయుడు, కూన రవికుమార్‌కు ఉందని తనకు లేదన్నారు. అలాంటి వాళ్లు ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.
 

ఈ వార్తలు కూడా చదవండి

కూన రవిపై తప్పుడు కేసులు, హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తాం: అచ్చెన్నాయుడు వార్నింగ్

శ్రీకాకుళంలో టెన్షన్, అజ్ఞాతం వీడని కూన రవికుమార్: పోలీసుల వేట, రిమాండ్ కు అనుచరులు

తప్పుడు ఆరోపణలతో క్షోభకు గురిచేయొద్దు: కోడెల

టీడీపీ నేతలకు కేసుల ఉచ్చు: కోడెలతో మొదలు పెట్టి...

సీబీఐ విచారణకు హైకోర్టు ఆర్డర్: అజ్ఞాతంలోకి యరపతినేని

ఫోర్జరీ సంతకాలు.. భూమి విక్రయం: మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు నమోదు

అజ్ఞాతంలోకి టీడీపీ నేత కూన రవికుమార్: పోలీసుల గాలింపు

కోడెల షోరూంలో తనిఖీలు: అసెంబ్లీ ఫర్నీచర్ రికవరీ

అసెంబ్లీ ఫర్నీచర్ దారి మళ్లింపు: కోడెలపై మరో కేసు

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...