మండలి రద్దుకు జగన్ కసరత్తు: అసెంబ్లీలో తీర్మానం?
ఏపీ రాష్ట్ర శాసనమండలిని రద్దు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే ప్రచారం సాగుతోంది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలిని రద్దు చేసే చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు తీర్మానాన్ని సిద్దం చేసిందని సమాచారం.
శాసనమండలిలో ఇవాళ చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టాలని సర్కార్ భావిస్తోంది. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే శాసనమండలిని రద్దు చేయడం అంత సులభం కాదని పవన్ టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు చెప్పారు.
also read: ఢిల్లీకి పవన్ కళ్యాణ్: బీజేపీ, జనసేన నేతల కీలక భేటీ
శాసనమండలిలో టీడీపీకి 29 మంది సభ్యులు ఉన్నారు. వైసీపీకి 9 మంది సభ్యులు ఉన్నారు. పీడీఎప్ కు ఆరుగురు సభ్యులు, బీజేపీకి ఇద్దరు సభ్యులు ఉన్నారు. మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. టీడీపీకి చెందిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ మంగళవారం నాడు తన పదవికి రాజీనామా చేశారు.
Also read:అందుకే టీడీపీ ఒక్క స్థానంలోనే గెలిచింది: అసెంబ్లీలో జగన్
Also read:జగన్‌కు షాక్: మండలిలో టీడీపీ నోటీసుపై చర్చకు అనుమతి
Also read:బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ
Also read:ఏపీ అసెంబ్లీలో టీడీపీ నిరసన: హెడ్‌సెట్ తీసేసి కోపంగా వెళ్లిన స్పీకర్ తమ్మినేని
టీడీపీకి శాసనమండలిలో మెజారిటీ ఉంది. ఇవాళ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టారు అయితే ఈ బిల్లు కంటే ముందే టీడీపీ సభ్యులు 71 రూల్ కింద నోటీసు ఇచ్చారు.
ఈ నోటీసుపై చర్చకు శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ అనుమతి ఇచ్చారు. పాలనా వీకేంద్రీకరణ బిల్లుపై చర్చను అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరింది. ఈ విషయమై మంత్రి బొత్స సత్యనారాయణ మండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండలి ఛైర్మెన్ స్పందించారు.
also read:మండలిలో బిల్లు: 71 కింద చర్చకు పట్టు, టీడీపీ సభ్యుల గైర్జాజర్
Also read:ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ బిల్లు: కౌంటర్ వ్యూహాంతో టీడీపీ
మండలిని రద్దు చేసే తీర్మానాన్ని ఏపీ సర్కార్ రెడీ చేసింది. ఈ తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టాలని భావిస్తోంది.ఈ విషయమై మంత్రివర్గం సమావేశాన్ని ఏర్పాటు చేసి శాసనమండలిని రద్దు విషయమై కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ విషయమై వైసీపీ నాయకత్వం చర్చిస్తుంది.
ఇదిలా ఉంటే శాసనమండలిని రద్దు చేయడం అంత సులభం కాదని టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు చెప్పారు. శాసనమండలిని రద్దు చేసే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.