బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్, టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మధ్య ఆసక్తికర సంభాషణ

ఏపీ అసెంబ్లీ లాబీల్లో మంగళవారం నాడు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటో చేసుకొంది. 

Ap Assembly: interesting conversation between Bjp MLC Madhav and TDP MLA gorantla butchaiah chowdary


అమరావతి: ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి,బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ‌ మధ్య మంగళవారం నాడు అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర చర్చ సాగింది.

Also read:ఏపీ అసెంబ్లీలో టీడీపీ నిరసన: హెడ్‌సెట్ తీసేసి కోపంగా వెళ్లిన స్పీకర్ తమ్మినేని

మంగళవారం నాడు  ఏపీ అసెంబ్లీ, శాసనమండలిలు వాయిదా పడ్డాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీల్లో  టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ మాధవ్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య  చిట్ చాట్ జరిగింది.

also read:మండలిలో బిల్లు: 71 కింద చర్చకు పట్టు, టీడీపీ సభ్యుల గైర్జాజర్

అసెంబ్లీ, మండలిలో చోటు చేసుకొన్న పరిణామాలపై వీరిద్దరూ చర్చించుకొన్నారు. ఇంగ్లీష్ మీడియం బిల్లు, మూడు రాజధానుల బిల్లును తప్పనిసరిగా వెనక్కి పంపుతామని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ స్పష్టం చేశారు.అమరావతి విషయంలో కూడ తమ పార్టీ నిర్ణయాన్ని ఇప్పటికే ప్రకటించిన విషయాన్ని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ గుర్తు చేశారు.

Also read:ఏపీ శాసనమండలిలో పాలనా వికేంద్రీకరణ బిల్లు: కౌంటర్ వ్యూహాంతో టీడీపీ

 మూడు రాజధానులు ఉన్నప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులు ఉంటే బెటర్ అని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ దృష్టికి తీసుకొచ్చారు. 

శాసనమండలిలో  ఈ అంశాన్ని లేవనెత్తాలని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ దృష్టికి తీసుకెళ్లారు.ఈ విషయాన్ని శాసనమండలిలో ప్రస్తావిస్తానని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్  టీడీపీ ఎమ్మెల్సీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి దృష్టికి తీసుకొచ్చారు.  


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios