అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి భూమా అఖిలప్రియ జనసేనలో చేరుతారంటూ జరుగుతున్న ప్రచారం వెనక పెద్ద కథే ఉన్నట్లు చెబుతున్నారు. పోలీసుల తీరుపై అలక వహించిన అఖిలప్రియ ప్రభుత్వం కల్పించిన సెక్యూరిటీని వెనక్కి పంపించారు. ఆమె బాటలోనే సోదరుడు బ్రహ్మానంద రెడ్డి కూడా నడిచారు. 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై అలక వహించిన అఖిల ప్రియ జనసేన వైపు అడుగులు వేస్తున్నారంటూ ప్రచారం ముమ్మరంగా సాగింది. అయితే, తనకు పార్టీ మారాల్సిన ఖర్మ పట్టలేదని ఆమె కొట్టిపారేశారు. అయినప్పటికీ ఆ ప్రచారం ఆగడం లేదు.

అయితే, అఖిలప్రియ భర్త భార్గవ నాయుడు కూడా రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నట్లు వినికిడి. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆయన రాజకీయాల్లోకి వచ్చి నంద్యాల పార్లమెంటు సీటు నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

అందుకు అనుగుణంగానే ఆయన జనసేనలోని పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం నుంచి అఖిల ప్రియ తండ్రి భూమా నాగిరెడ్డి పలుమార్లు ప్రాతినిధ్యం వహించారు. నంద్యాల శాసనసభ స్థానం నుంచి కూడా ఆయన గెలుపొందారు. 

ఈ స్థితిలో ఆళ్లగడ్డ నుంచి అఖిలప్రియ, నంద్యాల నుంచి బ్రహ్మానంద రెడ్డి, నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి భార్గవ నాయుడు పోటీ చేసేందుకు వీలుగా జనసేనలో చేరాలని అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. 

సంబంధిత వార్తలు

పార్టీ మార్పుపై తేల్చేసిన మంత్రి అఖిలప్రియ

చంద్రబాబుపై అలక: జనసేనలోకి అఖిలప్రియ?

వారందరికీ చంద్రబాబు షాక్: అఖిలప్రియకూ డౌటే?

అఖిలప్రియకు హోం మంత్రి చినరాజప్ప హెచ్చరిక

చెల్లెలు బాటలో అన్న.. భద్రత వెనక్కి

పోలీసులపై అలక.. మంత్రి అఖిలప్రియ వివరణ

అలక: సెక్యూరిటీని తిరస్కరించి జన్మభూమిలో అఖిలప్రియ

మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు