ఏపీ మంత్రి అఖిలప్రియ బాటలోనే ఆమె సోదరుడు  భూమా బ్రహ్మానందరెడ్డి  కూడా నడుస్తున్నారు. తన మద్దతుదారుల ఇళ్లల్లో పోలీసులు దాడులు చేశారనే కారణంతో.. మంత్రి అఖిల ప్రియ పోలీసులపై అలకబూనిన సంగతి తెలిసిందే. తనకు ప్రభుత్వం కేటాయించిన భద్రతను కూడా ఆమె వెనక్కి పంపించేశారు.

కాగా.. ఇప్పుడు ఆమె బాటలోనే ఆమె అన్నయ్య, నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా ఇదే వైఖరి ప్రదర్శించారు.  తనకు ప్రభుత్వం కేటాయించిన భద్రతన వద్దని బ్రహ్మానందరెడ్డి ప్రకటించారు. తన గన్ మెన్ లను వెనక్కి పంపించేశారు. తన చెల్లెలికి లేని భద్రత నాకు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

సోమవారం బ్రహ్మానందరెడ్డి వ్యక్తిగత సిబ్బంది, గన్ మెన్ లు లేకుండానే జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా.. ఇప్పుడు ఈ ఇద్దరు అన్నా చెల్లెల వ్యవహార శైలి పార్టీలో తీవ్ర చర్చనీయాంశమైంది. 

read more news

పోలీసులపై అలక.. మంత్రి అఖిలప్రియ వివరణ

అలక: సెక్యూరిటీని తిరస్కరించి జన్మభూమిలో అఖిలప్రియ

మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు