తన ఇళ్లల్లో, తన అనుచరుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేయడంపై మంత్రి అఖిల ప్రియ అకలబూనిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తనకు కేటాయించిన భద్రతను కూడా ఆమె తిరస్కరించారు. కాగా.. ఈ విషయంపై తాజాగా అఖిల ప్రియ వివరణ ఇచ్చారు.

ఎలాంటి కేసులు లేని వారి ఇళ్లపైనే పోలీసులు దాడులు చేశారని, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కనీసం ఎన్నికల షెడ్యూల్‌ కూడా విడుదల కాలేదని, షెడ్యూల్‌ విడుదలయ్యాక తన ఇంట్లో కూడా సోదాలు చేసుకోవచ్చని అన్నారు. తనను, తన కార్యకర్తలపై టార్గెట్‌ చేయడం బాధాకరమన్నారు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాని పేర్కొన్నారు. 

ప్రజలు, కార్యకర్తలే తన కు రక్షణగా ఉంటారని పేర్కొన్నారు. పోలీసులంటే మాకెంతో గౌరవమని అన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కార్డన్‌ సర్డ్‌ చేశారని తెలిపారు. తప్పుడు సమాచారం తీసుకొని ఇలా చేయడం తగదని అన్నారు. ఎస్పీకి తప్పుడు సమాచారం ఇస్తున్నారని పేర్కొన్నారు. తనకు ఎలాంటి భద్రత అవసరం లేదని మరోసారి తేల్చి చెప్పారు. 

 

సంబంధిత వార్తలు

అలక: సెక్యూరిటీని తిరస్కరించి జన్మభూమిలో అఖిలప్రియ

మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు