కర్నూల్: టీడీపీని వీడే ప్రసక్తే లేదని  ఏపీ పర్యాటక శాఖ మంత్రి  భూమా అఖిలప్రియ తేల్చి  చెప్పారు.  జనసేనలో అఖిలప్రియ చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో  భూమా అఖిలప్రియ ఈ విషయమై స్పష్టత ఇచ్చారు.

శుక్రవారం నాడు మంత్రి అఖిలప్రియ ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ  టీడీపీని వీడి జనసేనలో చేరుతారనే ప్రచారంపై స్పందించారు. జనసేనలోకి వెళ్లాల్సిన అవసరం తనకు తెలియదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుండి  టీడీపీ అభ్యర్ధిగా తానే పోటీ చేస్తానని  ఆమె చెప్పారు. 

తన విజయాన్ని చంద్రబాబునాయుడుకు కానుకగా ఇస్తానని మంత్రి తెలిపారు. ఆళ్లగడ్డలో తన అనుచరులను  వేధింపులకు గురి చేస్తున్నందునే  గన్‌మెన్లను దూరంగా పెట్టాల్సి వచ్చిందని ఆమె వివరణ ఇచ్చారు. తన పోరాటం టీడీపీపై కాదన్నారు. తన అనుచరులను వేధింపులకు గురి చేస్తున్నందునే  పోలీసులపై పోరాటం చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు.
 

సంబంధిత వార్తలు

చంద్రబాబుపై అలక: జనసేనలోకి అఖిలప్రియ?

వారందరికీ చంద్రబాబు షాక్: అఖిలప్రియకూ డౌటే?

అఖిలప్రియకు హోం మంత్రి చినరాజప్ప హెచ్చరిక

చెల్లెలు బాటలో అన్న.. భద్రత వెనక్కి

పోలీసులపై అలక.. మంత్రి అఖిలప్రియ వివరణ

అలక: సెక్యూరిటీని తిరస్కరించి జన్మభూమిలో అఖిలప్రియ

మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు