పోలీసులు కక్ష గట్టి టీడీపీ కార్యకర్తలను, నాయకులను వేధిస్తున్నారని అఖిలప్రియ ఆరోపించారు. తన సొంత అనుచురలపై పీడీ చట్టం ప్రయోగించారని, కార్డాన్ సర్చ్ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. 

కర్నూలు: పోలీసులపై ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అనుచరులను కాపాడుకోవడానికి తాను ఎంత దూరమైనా వెళ్తానని ఆమె హెచ్చరించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పోలీసులు కక్ష గట్టి టీడీపీ కార్యకర్తలను, నాయకులను వేధిస్తున్నారని అఖిలప్రియ ఆరోపించారు. తన సొంత అనుచురలపై పీడీ చట్టం ప్రయోగించారని, కార్డాన్ సర్చ్ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. 

పోలీసులపై ఆగ్రహించిన ఆమె ప్రభుత్వం తనకు కల్పించిన భద్రతను తిరస్కరించారు. సొంత సెక్యూరిటీతోనే మావోయిస్టుల ప్రభావం ఉన్న కర్నూలు జిల్లా రుద్రావరం మండలంలో మంత్రి అఖిలప్రియ పర్యటించారు. 

సంబంధిత వార్త

అలక: సెక్యూరిటీని తిరస్కరించి జన్మభూమిలో అఖిలప్రియ