వైసీపీ చీఫ్ వైఎస్‌ జగన్‌తో తన సెల్పీపై  సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కావడంపై సినీ నటి అలేఖ్య ఆవేదన వ్యక్తం చేశారు.తనపై తప్పుడు ప్రచారం సాగడాన్ని ఆపివేయాలని ఆమె కోరారు


హైదరాబాద్: వైసీపీ చీఫ్ వైఎస్‌ జగన్‌తో తన సెల్పీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం కావడంపై సినీ నటి అలేఖ్య ఆవేదన వ్యక్తం చేశారు.తనపై తప్పుడు ప్రచారం సాగడాన్ని ఆపివేయాలని ఆమె కోరారు. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని స్క్రీన్‌షాట్లతో కొందరు అభిమానులు తనకు షేర్ చేశారని ఆమె గుర్తు చేశారు. ఈ రకమైన తప్పుడు ప్రచారాన్ని నిలిపివేయాలని ఆమె కోరారు.

జనసేన చీఫ్ వపన్ కళ్యాణ్‌పై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ వ్యక్తిగత విమర్శలు చేశారు. కార్లను మార్చినట్టుగానే పవన్ కళ్యాణ్ భార్యలను మార్చుతాడని విమర్శలు చేశారు. ఈ విమర్శలకు కౌంటర్‌గా సోషల్ మీడియాలో నటి అలేఖ్యతో జగన్ దిగిన సెల్ఫీ ఫోటోలు వైరల్‌గా మారాయి.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడంతో తాను ఓ స్టేట్‌మెంట్ ఇవ్వాలనే నిర్ణయంతో ఈ వ్యాఖ్యలను రాస్తున్నట్టు ఆమె తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. ఈ స్టేట్‌మెంట్‌తో పాటు ఫోటోలను కూడ ఆమె తన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం తనను తీవ్రంగా బాధకు గురిచేసిందన్నారు.సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తప్పుబట్టారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. తన బాధను అర్థం చేసుకోవాలని ఆమె కోరారు.

2017 ఫిబ్రవరి 18వ, తేదీన హైద్రాబాద్ లోటస్‌పాండ్‌లో ఓ సీడీ ఆవిష్కరణ సమయంలో జగన్‌ను కలిసినట్టు ఆలేఖ్య ప్రకటించారు.ఈ సమయంలో తాను తన కుటుంబసభ్యులతో పాటు తన మ్యూజిక్ టీమ్‌ కూడ హజరైనట్టు ఆమె గుర్తు చేసుకొన్నారు.అయితే సీడీ ఆవిష్కరణ తర్వాత తాను జగన్‌ ను సెల్పీ కోసం అడిగానని చెప్పారు. తన కోరిక మేరకు జగన్‌తో సెల్పీ తీసుకొన్నట్టు ఆమె చెప్పారు.

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ను లక్ష్యంగా చేసుకొని చేస్తున్న విమర్శల్లో తాను బలౌతున్నానని అలేఖ్య చెప్పారు. మరో వైపు తాను పవన్ కళ్యాణ్‌కు పెద్ద అభిమానినని ఆమె చెప్పారు. పవన్ కళ్యాణ్‌కు మానవత్వ విలువలంటే తనకు చాలా ఇష్టమని ఆమె గుర్తు చేసుకొన్నారు.ఈ తరహ పోస్టులు తమ కుటుంబసభ్యులకు జరిగితే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని ఆమె సూచించారు.

పవన్ కళ్యాణ్ కు చెందిన ఓ కొటేషన్ ను కూడ ఆమె ప్రస్తావించారు.ఈ కొటేషన్‌ను తాను ఎప్పుడూ గుర్తు చేసుకొంటూ ఉంటానని ఆమె చెప్పుకొన్నారు. అయితే తనపై పెట్టిన పోస్టులను వెంటనే సోషల్ మీడియా నుండి తొలగించాలని కోరారు. ఈ పోస్టులను తొలగించకపోతే పవనిజం కూడ డ్యామేజీ అవుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ వార్తలు కూడ చదవండి:ఎవరి వ్యక్తిగత జీవితాల్లో... జగన్‌కు పవన్ కౌంటరిదే

దోచుకొనే నీకే అంతుంటే నాకెంతుండాలి: జగన్‌పై వపన్

పవన్‌ భార్యలే తేల్చుకోవాలి: జగ‌న్‌కు ఉండవల్లి కౌంటర్

సమాధానమిస్తా: జగన్ వ్యాఖ్యలపై పవన్ స్పందన

కార్లను మాదిరిగానే భార్యలను మారుస్తాడు: పవన్‌పై జగన్‌ సంచలనం (వీడియో)