Naresh Kumar | Published: Jul 30, 2021, 11:00 AM IST
హుజూరాబాద్ ఎన్నికల వేడి రోజు రోజుకూ రాజుకుంటోంది. బిజెపి నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను బలహీనపరచడంపైనే తెలంగాణ సీఎం కేసీఆర్ దృష్టి పెట్టారు. అందుకు ఆయన బహుముఖ వ్యూహాన్ని రచించి అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెసు, బిజెపి రాష్ట్ర నాయకులకే కాకుండా స్థానిక నాయకులకు కూడా గాలం వేస్తున్నారు.