ఏపి రాజకీయాలు: వైఎస్ జగన్ కు డేంజర్ బెల్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. 

Share this Video

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ చీఫ్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం కావడానికి ప్రాతిపదిక ఏర్పడుతోంది. తాము, జనసేన, టిడిపి వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని సిపిఐ నేత నారాయణ చెప్పారు. ఈ మూడు పార్టీల మధ్య సూత్రప్రాయంగా ఓ అంగీకారం కుదిరినట్లు దీన్ని బట్టి అర్ణమవుతోంది. ఎన్నికల నాటికి బిజెపి కూడా ఆ పార్టీలతో కలిసి వస్తుందా అనే ప్రశ్న ఉండనే ఉంది. మొత్తం మీద వైఎస్ జగన్ కు ప్రమాద ఘంటికలు మోగుతున్నట్లు చెప్పవచ్చు. ఆయన తగిన దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. పార్టీలో ధిక్కారం కూడా కనిపించడం వైఎస్ జగన్ నాయకత్వానికి ఓ సవాల్.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred