Jan 22, 2021, 1:50 PM IST
హీరో శరత్‌కుమార్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా కొద్దికాలంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి. బొద్దుగా, ముద్దుగా ఉండే వరలక్ష్మి, హీరో విశాల్‌తో చాలాకాలం ప్రేమాయణం నడిపించింది. వరలక్ష్మీ, విశాల్ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే శరత్ కుమార్, విశాల్ మధ్య నెలకొన్న వైరం కారణంగా ఈ ప్రేమ జంట విడిపోయింది. అయితే తాజాగా వరలక్ష్మి ఓ యువ క్రికెటర్‌ను పెళ్లాడబోతోందని వార్తలు వస్తున్నాయి.