ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

By narsimha lode  |  First Published Oct 22, 2018, 11:39 AM IST

మహా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయమై  చర్చలు కొనసాగుతున్నాయి. 



హైదరాబాద్: మహా కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయమై  చర్చలు కొనసాగుతున్నాయి.  దీంతో ఈ కూటమి కుదురుకోకముందే  విచ్ఛిన్నమయ్యే పరిస్థితులున్నాయని ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు.సీట్ల సర్దుబాటును తేల్చకపోతే  మా దారి మేం చూసుకొంటామని భాగస్వామ్యపార్టీల నేతల ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్‌ను హెచ్చరించారు.

తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీన ఎన్నికలు  జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను ఓడించేందుకు గాను  మహాకూటమి( ప్రజా కూటమి) ఏర్పాటైంది. టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్‌లు ఈ కూటమిలో భాగస్వామ్యులుగా ఉన్నారు.

Latest Videos

ఈ కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్ధుబాటు ఇంకా తేలలేదు. టీజేఎస్ చీప్ కోదండరామ్  సీట్ల సర్ధుబాటును తేల్చాలని కాంగ్రెస్ పార్టీపై ఒత్తిడి తెస్తున్నారు.కాంగ్రెస్ పార్టీకి తొలుత 36 సీట్ల జాబితాను ఆ పార్టీ నేతలు ఇచ్చారు. తాజాగా కనీసం  12 సీట్లు ఇవ్వాలని ఆ పార్టీ నేతలు ప్రతిపాదిస్తున్నారు.  కానీ 6 సీట్లు ఇచ్చేందుకు  కాంగ్రెస్ పార్టీ నేతలు సానుకూలంగా స్పందించారు.

తాము బలహీనంగా ఉన్న స్థానాలను  టీజెఎస్‌కు ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. అయితే తాము కోరిన సీట్లను ఇవ్వకపోతే  రెబెల్‌గా పోటీ చేయడానికి కూడ వెనుకాడబోమని కూడ  కొందరు టీజెఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు.

టీజేఎస్‌లో చేరే సమయంలో టిక్కెట్టు విషయమై హామీ పొందిన నేతలు ఈ విషయమై రెబెల్‌గా పోటీకి కూడ రెడీ అంటున్నారు.  కొందరైతే  తాము  పోటీ చేసేందుకు టిక్కెట్లు దక్కకపోతే పార్టీని వీడుతామని  హెచ్చరిస్తున్నారనే  ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో కాంగ్రెస్‌ పార్టీపై  టీజేఎస్ నేతలు సీట్ల సర్దుబాటును పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

click me!