ఎన్నికల వేళ ‘‘హవాలా’’ హవా...కోట్ల రూపాయలు తరలిస్తున్న ముఠా అరెస్ట్

By sivanagaprasad kodatiFirst Published Oct 22, 2018, 11:19 AM IST
Highlights

తెలంగాణ ఎన్నికల నగారా మోగడంతో ధన ప్రవాహం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో హవాలా మార్గంలో పెద్ద మొత్తంలో డబ్బును తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 

తెలంగాణ ఎన్నికల నగారా మోగడంతో ధన ప్రవాహం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో హవాలా మార్గంలో పెద్ద మొత్తంలో డబ్బును తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై రామ్‌కోఠి వెళుతండగా వారిని పోలీసులు అడ్డుకుని తనఖీ చేయగా.. వాహనంలో రెండున్నర కోట్లు దొరికాయి.

నలుగురిని స్టేషన్‌కు తరలించి విచారించగా.. తమ యజమాని జయేశ్ ఆదేశాల మేరకు తాము కోఠిలో డబ్బులు చెల్లించడానికి వెళుతున్నట్లుగా నిందితులు తెలిపారు. వారిచ్చిన సమాచారంతో జయేశ్ అనే వ్యక్తి ఇళ్లు, కార్యాలయాలపై పోలీసులు దాడులు చేశారు.

ఇతను హవాలా మార్గంలో డబ్బును తరలిస్తాడని పోలీసులు చెబుతున్నారు.. ఎన్నికల సమయంలో తెలంగాణలో నల్లధనం హవాలా మార్గంలో చేతులు మారుతుందని ఇంటెలిజెన్స్ ముందుగానే చెప్పింది.

ఆరు నుంచి ఎనిమిది శాతం కమీషన్ ఇస్తే చాలు.. ఎంత పెద్ద మొత్తమైనా చెల్లించేందుకు హైదరాబాద్‌లో కొందరు హవాలా వ్యాపారులు ఉన్నట్లు సమాచారం. హవాలా వ్యాపారంలో ముంబై తర్వాత హైదరాబాద్‌ రెండవ స్థానంలో ఉంది. మరోవైపు నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని ఐటీ అధికారులకు అప్పగించారు. 

click me!