నా లక్ష్యం అదే...ఈ విజయం ట్రైలర్ మాత్రమే: పివి సింధు

By Arun Kumar PFirst Published Aug 27, 2019, 9:26 PM IST
Highlights

వరల్డ్ ఛాంపియన్‌షిప్ విజయం తర్వాత పివి సింధు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కోచ్ గోపిచంద్ తో కలిసి  ఆమె మీడియా సమావేేశంలో పాల్గొన్నారు.  

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ విజయం తర్వాత పివి సింధు మొదటిసారి హైదరాబాద్ లో అడుగుపెట్టారు. డిల్లీ నుండి నేరుగా హైదరాబాద్ కు చేరుకున్న ఆమెకు బెంగంపేట విమానాశ్రయంలో ఘన స్వాగతం లభిచింది. ఆ తర్వాత సింధు, కోచ్ గోపించంద్ లు మీడియాతో మాట్లాడారు. 

మొదట సింధు మాట్లాడుతూ... తన విజయంలో కోచ్ గోపించంద్ పాత్ర చాలా వుందన్నారు. ఆయనకు మొదట కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత  తన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తనకు మద్దతిచ్చిన అభిమానులకు, మీడియా సభ్యులు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా థ్యాంక్యూ చెప్పారు. 

తాను ఎన్నో ఏళ్లుగా ఈ  పతకం  కోసమే ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. చివరకు దాన్ని సాధించడం ఎంతో ఆనందంగా వుందన్నారు. అయితే గతంలో సిల్వర్ సాధించినప్పుడు కూడా ఆనందంగానే వుండేది కానీ ఏదో వెలితి వుండేది. ఈ సారి అది కూడా లేదని సింధు వెల్లడించారు. 

గత ఛాపింయన్‌షిప్ లో ఎక్కడ తప్పులు చేశామో వాటిని ఈసారి రిపీట్ చేయలేదు. వాటిని అధిగమించడానికి శక్తివంచన లేకుండా చాలా శ్రమించాను. ఈ సమయంలోనే చాలా విషయాలు నేర్చుకుంటూ....తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగినట్లు తెలిపారు. ఈ విజయం తనకెంతో కాన్పిడెంట్ ఇచ్చిందనన్నారు. దీన్ని టోక్యో ఒలింపిక్స్ లో కొనసాగించాలని భావిస్తున్నాను. టోక్యో ఒలింపింక్స్ లో రాణించి పతకం సాధించడమే ఇప్పుడు తనముందున్న లక్ష్యమని సింధు అన్నారు.  

ఈ  మ్యాచ్ లో ఫైనల్ ఫోబియా నుండి బయటపడేందుకు మైండ్ గేమ్ ను ఉపయోగించానని సింధు తెలిపారు. ఫైనల్ ను కూడా క్వార్టర్స్, సెమీస్ లలో ఆడినట్లే ఆడాను. ఇలా ఫైనల్ గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం వల్ల ఒత్తిడి  తగ్గింది. దాంతో ఇంత  సునాయాసంగా విజయాన్ని సాధించగలిగానని తెలిపారు. 

జపాన్ క్రీడాకారిణి ఒకుహరాతో మ్యాచ్ కాబట్టి తప్పకుండా లాంగ్ ర్యాలీ వుంటుందని భావించా. అందుకు సిద్దపడే బరిలోకి దిగాను. అయితే తాను ఒక్కసారిగా ఎదురుదాడికి దిగేసరికి ప్రత్యర్ధి డీలా పడిపోయింది. దీంతో అదే ఆటతీరును కొనసాగించి విజయాన్ని అందుకున్నాను. 

ఇక మెడల్ అందుకునే సమయంలో ఉద్వేగానికి లోనై కన్నీళ్లు ఆగలేవని సింధు తెలిపారు. ముఖ్యంగా జాతీయగీతాలాపన సమయంలో చాల ఎమోషన్ అయ్యాను. అనుకోకుండానే కన్నీళ్లు వచ్చేశాయి అని సింధు తెలిపారు.

సంబంధిత వార్తలు

హైదరాబాద్ కు పివి సింధు...స్వాగతం పలికిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ (వీడియో)

 అలా ప్రశ్నించేవారికి ఇదే నా సమాధానం: పివి సింధు సీరియస్

చరిత్ర సృష్టించిన పీవి సింధు...వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో ఘన విజయం

2017 ఓటమి... ఒకుహురాపై ప్రతీకారం తీర్చుకున్న సింధు

 బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ గా పివి సింధు... విన్నింగ్ మూమెంట్స్ (ఫోటోలు)

వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా పివి సింధు... కేటీఆర్, హరీష్‌ల అభినందనలు

click me!