Team India T20 World Cup: రింకూ సింగ్, కేఎల్ రాహుల్ ను ఎంపిక చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదే.. !

By Mahesh Rajamoni  |  First Published May 3, 2024, 1:44 AM IST

Team India T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఏప్రిల్ 30న బీసీసీఐ ప్రకటించింది. రింకూ సింగ్, కేఎల్ రాహుల్ ల‌కు టాప్-15లో చోటు దక్కలేదు. దీనికి గ‌ల కార‌ణాల‌ను చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వివ‌రిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు  చేశారు. 
 


Team India T20 World Cup 2024 Squad: రాబోయే టీ20 ప్రపంచ కప్ 2024 కోసం 15 మంది సభ్యుల భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే, త‌ప్ప‌కుండా జ‌ట్టులో ఉంటార‌నుకున్న ఇద్ద‌రు భార‌త స్టార్ ప్లేయ‌ర్ల‌కు జ‌ట్టులో చోటుద‌క్క‌లేదు. వారిలో వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్, స్టార్ ఫినిష‌న్ రింకూ సింగ్ లు ఉన్నారు. ఇద్దరు ఆటగాళ్లు టాప్-15లో చోటు దక్కించుకోలేదు. అయితే, వీరికి వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో స్థానం క‌ల్పించ‌క‌పోవ‌డంతో అభిమానుల నుంచి బీసీసీఐ పై ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోనే చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్ల‌ను జ‌ట్టులోకి తీసుకోక‌పోవ‌డానికి గ‌ల కార‌ణాల‌ను వివ‌రించాడు. 

రింకూ సింగ్ ఎలాంటి తప్పు చేయలేదు..

Latest Videos

అగార్కర్‌తో పాటు, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఐపీఎల్ 2024 ప్రదర్శన ఆధారంగా మాత్రమే జట్టును ఎంపిక చేయలేదని చెప్పాడు. ఐపీఎల్‌కు ముందే 70 శాతం మంది జట్టు ఎంపికయ్యారు. రింకూ సింగ్ గురించి అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. 'రింకూ సింగ్ ఎలాంటి తప్పు చేయలేదు. వారిని దూరంగా ఉంచడం అత్యంత కష్టతరమైంది. శుభ్‌మన్ గిల్ విషయంలోనూ అదే జరిగింది. ముందుగా టీమ్ కాంబినేషన్ చూసి కఠిన నిర్ణయాలు తీసుకున్నాం. అతను జట్టుతో వెళ్తాడు. ఐపీఎల్ 2024లో రింకూ బ్యాట్ కదలకుండా చూడలేదు. టీ20 ప్రపంచకప్‌లో రింకూ సింగ్ జట్టుతో కలిసి ప్రయాణించనున్నాడు. కానీ అతని పేరు టాప్-15లో లేదు. రిజర్వ్ ప్లేయర్ల జాబితాలో రింకూ చోటుద‌క్కింది.
కేఎల్ రాహుల్‌ను ఎందుకు తీసుకోలేదు?

స్టార్ వికెట్ కీపర్ అండ్ బ్యాట‌ర్ కేఎల్ రాహుల్ గురించి అజిత్ అగార్కర్ మాట్లాడుతూ.. 'కేఎల్ రాహుల్ గొప్ప ఆటగాడు. మిగతా వికెట్ కీపర్లు మిడిల్ ఆర్డర్‌లో ఆడుతుండగా, రాహుల్ టాప్ ఆర్డర్‌లో ఉన్నాడు. ఇది జట్టును బ్యాలెన్స్ చేసేందుకు తీసుకున్న చర్య మాత్రమే. ఐపీఎల్‌లో రాహుల్ టాప్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నాడు. టీ20 ప్రపంచకప్‌కు మిడిలార్డర్‌లో రిషబ్ పంత్, సంజూ శాంసన్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా ఎంపికయ్యారు. టీ20 ప్రపంచకప్‌ జట్టు నుంచి కేఎల్‌ రాహుల్‌ని తప్పించడానికి ఇదే ప్రధాన కారణంగా సెల‌క్ట‌ర్లు పేర్కొన్నారు.

టీ20 ప్రపంచకప్ 2024 కోసం భారత జట్టు

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ చాదల్, యుజ్వేంద్ర యాదవ్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. సిరాజ్. 

రిజర్వు ప్లేయ‌ర్లు : శుభ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్ మరియు అవేష్ ఖాన్.

SRH VS RR : థ్రిల్లింగ్ మ్యాచ్ అంటే ఇదే.. భువ‌నేశ్వ‌ర్ మెరుపుల‌తో రాజ‌స్థాన్ ను చిత్తుచేసిన హైద‌రాబాద్

click me!