విజయనిర్మల మృతితో కన్నీటి పర్యంతమైన కృష్ణ: టాప్ స్టోరీస్

By rajesh yFirst Published Jun 27, 2019, 6:07 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

ప్రముఖ సినీ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్నుమూత

 ప్రముఖ తెలుగు సినీనటి, దర్శకురాలు విజయనిర్మల (73) కన్నుమూశారు. ఆమె వయస్సు 73 ఏళ్లు. హైదారాబాదులోని గచ్చిబౌలిలో గల కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 
 

చంద్రబాబు నివాసం వద్ద భద్రత తగ్గింపు

చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వగృహం వద్ద ఏపీఎస్పీ పోలీసు భద్రతను తొలగించారు. చంద్రగిరి పోలీసుస్టేషన్‌ ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లు మాత్రమే భద్రతా చర్యలు చేపడుతున్నారు. 
 

తాజ్ మహల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రాలోని యమునా నదీ తీరాన ఉండబట్టి సరిపోయింది. అదే మన రాష్ట్రంలో కృష్ణా నదీ తీరాన ఉండి ఉంటే’... అని నాని తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆయన పోస్టుకి టీడీపీ అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు.
 

 

బీజేపీలో చేరిన మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, బోడ జనార్ధన్‌

గురువారం నాడు  న్యూఢిల్లీలో  జరిగిన కార్యక్రమంలో  మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, బోడ జనార్ధన్ లు బీజేపీలో చేరారు. పెద్దిరెడ్డి ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు.  బోడ జనార్ధన్ గతంలో టీడీపీలో ఉండేవాడు. 
 

గెలుపోటములు సహజం.. కార్యక్షేత్రంలోకి దిగాలి: నారా భువనేశ్వరి

ప్రజావేదిక కూల్చివేతతో పాటు టీడీపీ నేతలపై దాడులు.. తమ కుటుంబసభ్యులకు భద్రతను కుదించడం తదితర విషయాలపై స్పందించారు టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.
 

దసరా తర్వాత కేసీఆర్ కేబినెట్ విస్తరణ: హరీష్‌‌కు చోటు, కారణమదేనా

దసరా పర్వదినం తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని సమాచారం. ఈ దఫా హరీష్ రావుతో పాటు కేటీఆర్‌కు కూడ మంత్రివర్గంలోకి తీసుకొనే  అవకాశం ఉంది.

 

ఎన్టీఆర్ పై సెటైర్లు.. 1109 ఓట్లతో విజయనిర్మల ఓటమి!

ఎన్టీఆర్ పై సెటైరికల్ గా రూపొందిన ప్రజల మనిషి, సాహసమే నా ఊపిరి చిత్రాలకు విజయనిర్మలే దర్శకురాలు కావడం విశేషం. ఈ చిత్రాల్లో కృష్ణ హీరోగా నటించారు. తనకు వ్యక్తిరేకంగా సినిమాలు తీసినా ఎన్టీఆర్ మాత్రం స్పోర్టివ్ గా తీసుకున్నారని ఓ సందర్భంలో విజయనిర్మల తెలిపారు. 
 

జ్వరంతో బాధపడుతూనే సెంచరీ...బాబర్ ఆజమ్ ను కోహ్లీతో పోలుస్తూ పాక్ కోచ్ ప్రశంసలు

 ''ఈ మ్యాచ్ కు ముందు రెండు మూడు రోజులుగా బాబర్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో ప్రాక్టీస్ సెషన్లో కూడా పాల్గొనలేదు. కేవలం ముందురోజు మాత్రం అదే జ్వరంతో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఇలా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికి అతడు జట్టు ప్రయోజనాల కోసమే ఆడి అద్భుత సెంచరీని  నమోదు చేసుకున్నాడు. వెల్లడించాడు.
 

టీం ఇండియా విజయాలకు బ్రేక్ వేస్తాం.. విండీస్

తమ జట్టులో అందరూ సమష్టిగా ఇప్పటివరకు ఆడలేదన్నారు. ఒకరు ఆడితే... మరొకరు విఫలమౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే గతంలో కొన్ని మ్యాచ్ లు ఓడిపోయామని అభిప్రాయపడ్డారు.
 

ఆ రికార్డ్ కృష్ణ-విజయనిర్మలకే సొంతం!

ఆ తరువాత వీరిద్దరూ కలిసి ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు 47 చిత్రాల్లో నటించారు. ఇదొక రికార్డ్ అనే చెప్పాలి. ఇంతవరకు టాలీవుడ్ లో ఏ జంట కూడా కలిసి ఇన్ని సినిమాలు చేయలేదు.
 

ఇండియా vs వెస్టిండిస్: విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ... అరుదైన రికార్డు నమోదు

ఈ క్రమంలో 37 పరుగుల వద్ద వుండగా అతడు ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 20 వేల పరుగుల మైలురాయిని అందుకున్న క్రికెటర్ గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. 
 

గతంలో తనకు నోటీసులు జారీ చేసిన సమయంలో కూడ ఈ నోటీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వని విషయాన్ని ఆయన ప్రస్తావించారు. తాను సమాధానం ఇవ్వకపోతే  తన అభిప్రాయాలతో ఏకీభవించినట్టేనా అని ఆయన ప్రశ్నించారు.
 

 

నిర్మాతలతో గొడవలు.. క్లారిటీ ఇచ్చిన అమలా పాల్

సినిమా కోసం డేట్స్ లెక్కచేయకుండా పని చేసిన సందర్భాలు ఉన్నాయి. సినిమా కోసం ఏమైనా చేస్తాను. అలాంటిది నేను అతిగా ప్రవర్తిస్తాను అనడంలో నిజం లేదని అమలాపాల్ ఆరోపించారు. విజయ్ సేతుపతి సినిమాలో నుంచి నన్ను తీసేయడానికి ప్రధాన కారణం నిర్మాతలతో ఏర్పడిన ఈగో క్లాష్ అని బేబీ వివరణ ఇచ్చింది. 

 

టీడీపీని భూస్థాపితం చేయం.. ప్రజావేదిక కూల్చకుండా ఉండాల్సింది: పురంధేశ్వరి


టీడీపీ నుంచి వలసలు కొనసాగుతాయన్నారు బీజేపీ నేత పురందేశ్వరి. తూర్పుగోదావరి జిల్లాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. టీడీపీ వాళ్లను తాము రమ్మని కోరడం లేదని.. ఆ పార్టీని భూస్థాపితం చేయాలన్నది లక్ష్యం కాదని ఆమె స్పష్టం చేశారు.

 

వచ్చే నెలలో మున్సిపల్ ఎన్నికలు: కేసీఆర్ సంకేతాలు

సభ్యత్వ నమోదు కార్యక్రమం జూలై 20లోపు పూర్తి చేయాలని డెడ్‌లైన్ పెట్టారు. విపక్షాలు, ఇతర పక్షాలు ప్రభుత్వంపై చేస్తోన్న విమర్శలను వెంటనే తిప్పి కొట్టాలని కూడా సీఎం సూచించారు.
 

రేపు కాపు నేతలతో బాబు భేటీ: అసంతృప్త నేతలకు బుజ్జగింపులు

 కాపు నేతలు. ఒకరిద్దరూ నేతలు బాబుతో సమావేశానికి దూరంగా ఉండే అవకాశం ఉందంటున్నారు. కానీ, మెజారిటీ నేతలు మాత్రం ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. 
 

 

కేటీఆర్, హరీష్ మధ్య ఆసక్తికర సంభాషణ: బావా.. ఇక అవి కన్పించవు

సచివాలయం శంకుస్థాపన జరిగిన తర్వాత బావ, బావమరుదల మధ్య ఆసక్తికరంగా సంభాషణ చోటు చేసుకొంది. మన చాంబర్లు చూసుకొందామన్నా కూడ కన్పించవు బావ.... అంటూ సరదాగా కేటీఆర్  హరీ‌ష్‌రావుతో వ్యాఖ్యానించారు.  ఈ వ్యాఖ్యలకు హరీష్ రావు నవ్వుతూ అవును అంటూ సమాధానం ఇచ్చారు.
 

మీ బాబు తరమే కాలేదు.. జగన్ పై లోకేష్ కామెంట్

మరో ట్వీట్ లో ‘‘మీ బాబు, మా బాబుపై 26 క‌మిటీలు వేశారు. అవినీతి ముద్ర‌వేయాల‌ని అడ్డ‌దారులు తొక్కారు. చివ‌రికి ఆయ‌న త‌రం కాలేదు. ఇప్పుడు మీ త‌ర‌మూ కాదు. వంశ‌ధార‌పై మీరు వేసిన క‌మిటీ రూపాయి అవినీతి జ‌ర‌గ‌లేద‌ని నివేదికిచ్చింది.’’ అని లోకేష్ పేర్కొన్నారు.
 

కొత్త సచివాలయ నిర్మాణానికి కేసీఆర్ శంకుస్థాపన

 ఇవాళ మంచి ముహుర్తం ఉన్నందున కొత్త సచివాలయ నిర్మాణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.వేద మంత్రాల మధ్య కేసీఆర్ భూమి పూజ చేశారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 

సీనియర్ డైరెక్టర్ తో బాలయ్య భేటీ.. మోక్షజ్ఞ కోసమేనా!

బాలకృష్ణ ఇటీవల సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావుని కలసినట్లు తెలుస్తోంది. బాలయ్య, సింగీతం కాంబోలో ఆదిత్య 369, భైరవ ద్వీపం లాంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఆదిత్య 369 సీక్వెల్ లో మోక్షజ్ఞ నటిస్తాడని కూడా ప్రచారం జరిగింది. ఈ వార్తకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. బాలయ్య తాజాగా సింగీతంతో భేటీ కావడంతో ఆసక్తిని రేపుతోంది. 
 

 

ఇంటర్ విద్యార్థులకు కూడ అమ్మ ఒడి పథకం: జగన్

హాస్టల్, రెసిడెన్షియల్  విద్యార్థులకు కూడ అమ్మఒడి పథకం వర్తింప చేయనున్నారు. ట్రిపుల్ ఐటీ విద్య సంస్థలను బలోపేతం చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకొంది.
 

ఎన్టీఆర్ కొడితే కిందపడిపోయిన వేళ.. సావిత్రి, విజయనిర్మల మధ్య రిలేషన్!

ఓ సందర్భంలో విచిత్ర కుటుంబం చిత్రాన్ని గుర్తిచేసుకుంటూ విజయనిర్మల ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఆ చిత్రంలో నేను ఎన్టీఆర్ కు మరదలిని. ఆయన నన్ను ఆటపట్టిస్తూ వీపుపై కొట్టే సన్నివేశం ఒకటి ఉంది. ఎన్టీఆర్ గారు పాత్రలో లీనమైపోయి నిజంగానే కొట్టేశారు. దెబ్బకు కింద పడ్డాను. వెంటనే సావిత్రి అక్క నన్ను పైకి లేపింది. అంత బలహీనంగా ఉంటే ఎలాగమ్మా.. కాస్త తిని నాలాగా ఉండాలి అని చెప్పింది. 
 

సెక్రటేరియట్ నిర్మాణాలపై నిరసన.. రాజాసింగ్ అరెస్ట్

వాస్తుదోషం పేరుతో సచివాలయం, అసెంబ్లీని కూల్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. పేద ప్రజల కోసం రెండు లక్షల ఇళ్లు నిర్మించి ఇస్తామన్న కేసీఆర్.. కనీసం 20 వేల ఇళ్లు కూడా కట్టలేదని ఆరోపించారు.
 

 

విజయనిర్మల భౌతికకాయం వద్ద విలపిస్తున్న కృష్ణని కేసీఆర్ ఓదార్చారు. కేసీఆర్ తో పాటు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇతర టిఆర్ఎస్ నేతలు విజయనిర్మల నివాళులు అర్పించారు. విజయనిర్మల భౌతికకాయానికి శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
 

 

విజయనిర్మల పార్థివదేహానికి పవన్ కళ్యాణ్ నివాళి!

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా విజయనిర్మల గారు తన ప్రతిభ చాటుకున్నారని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. విజయ నిర్మల ఎన్నో ఘనవిజయాలు సొంతం చేసుకుని మహిళలకు ఆదర్శంగా నిలిచారని పవన్ కళ్యాణ్ అన్నారు.

 

click me!