నిర్మాతలతో చీటికీ మాటికీ గొడవలు పెట్టుకుంటుందని అమలాపాల్ పై వచ్చిన ఆరోపణలు అన్ని ఇన్ని కావు. ఆమె ఏ మాత్రం సహకరించిందని రెమ్యునరేషన్ విషయంలో కొంచెం తేడా వచ్చినా గోల గోల చేస్తుందని కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. 

అందుకే ఇటీవల విజయ్ సేతుపతితో చేయాల్సిన ఒక సినిమా నుంచి నిర్మాతలు ఆమెను తీసేసి మేఘా ఆకాష్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు టాక్ వచ్చింది. అయితే ఈ విషయంపై అమలాపాల్ స్పందించింది. సినిమాలో నుంచి తప్పించిన మాట వాస్తవమే కానీ వచ్చిన రూమర్స్ లో ఎలాంటి నిజం లేదంటూ.. తనపై అనవసరంగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. 

గతంలో కొందరు నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చి సగం రెమ్యునరేషన్ ఇవ్వకపోయినా నేను వర్క్ చేశాను. షూటింగ్ స్పాట్ లో వసతులు లేకపోయినా అడ్జస్ట్ చేసుకున్నా. సినిమా కోసం డేట్స్ లెక్కచేయకుండా పని చేసిన సందర్భాలు ఉన్నాయి. సినిమా కోసం ఏమైనా చేస్తాను. అలాంటిది నేను అతిగా ప్రవర్తిస్తాను అనడంలో నిజం లేదని అమలాపాల్ ఆరోపించారు. విజయ్ సేతుపతి సినిమాలో నుంచి నన్ను తీసేయడానికి ప్రధాన కారణం నిర్మాతలతో ఏర్పడిన ఈగో క్లాష్ అని బేబీ వివరణ ఇచ్చింది.