ఏపీ సీఎం జగన్ పై మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా లోకేష్ సీఎం జగన్ పై పలు విమర్శలు చేశారు. జగన్ గారు అని సంభోదిస్తూ... సెటైర్లు వేశారు.

‘‘జగన్ గారూ.. అక్ర‌మాస్తుల కేసుల్లో మీపై లెక్క‌కు మించి చార్జిషీట్లున్నాయి. నిందితుడిగా జైలులో ఉన్నారు. మీరు నీతి, నిజాయితీ అని మాట్లాడుతుండ‌టం ఏమీ బాగోలేదు సార్‌!’’ అంటూ సెటైర్లు వేశారు.

మరో ట్వీట్ లో ‘‘మీ బాబు, మా బాబుపై 26 క‌మిటీలు వేశారు. అవినీతి ముద్ర‌వేయాల‌ని అడ్డ‌దారులు తొక్కారు. చివ‌రికి ఆయ‌న త‌రం కాలేదు. ఇప్పుడు మీ త‌ర‌మూ కాదు. వంశ‌ధార‌పై మీరు వేసిన క‌మిటీ రూపాయి అవినీతి జ‌ర‌గ‌లేద‌ని నివేదికిచ్చింది.’’ అని లోకేష్ పేర్కొన్నారు.

అనంతరం పోలవరం అంచనాలపై జగన్ చేసిన కామెంట్స్ కి కూడా లోకేష్ స్పందించారు. ‘‘పోల‌వ‌రంపై టీడీపీ హ‌యాంలో పంపిన అంచ‌నాల‌న్నింటికీ కేంద్రం ఓకే చెప్పింది. అందరూ మీలా అవినీతి పరులే అని ముద్ర వెయ్యాలి అనుకుంటున్న మీ కల...కల గానే మిగిలిపోతుంది’’ అని పేర్కొన్నారు.