అమరావతి: ఇంటర్ విద్యార్థులకు కూడ అమ్మ ఒడి పథకాన్ని కూడ వర్తింపజేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. 

గురువారం నాడు  విద్యశాఖపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిచారు.తెల్లరేషన్ కార్డు ఉన్న వారందరికీ  అమ్మ ఒడి పథకం కింద రూ. 15 వేలు చెల్లించాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

హాస్టల్, రెసిడెన్షియల్  విద్యార్థులకు కూడ అమ్మఒడి పథకం వర్తింప చేయనున్నారు. ట్రిపుల్ ఐటీ విద్య సంస్థలను బలోపేతం చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకొంది.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతులను కల్పించాలని జగన్ ఆదేశించారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో కూడ వసతులను పెంచనున్నట్టు  మంత్రి సురేష్ చెప్పారు. 

ఉన్నత విద్య శాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నట్టుగా మంత్రి తెలిపారు. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఖాళీలను భర్తీ చేస్తామన్నారు.