తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
11:54 PM (IST) Jun 21
Brazil hot air balloon fire : బ్రెజిల్‌లో 21 మంది ప్రయాణికులతో ఉన్న హాట్ ఎయిర్ బెలూన్ ఆకాశంలో అగ్ని ప్రమాదానికి గురైంది. అందరూ మంటల్లో చిక్కుకున్నారు.
10:17 PM (IST) Jun 21
Rishabh Pant roly poly shot: ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో రిషబ్ పంత్ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. పంత్ ఇన్నింగ్స్ పై సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించారు. పంత్ ఆడిన రోలీపోలీ షాట్ వైరల్ గా మారింది.
08:41 PM (IST) Jun 21
Rishabh Pant somersault celebrations: ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ సెంచరీతో అదరగొట్టాడు. ఆ తర్వాత తనదైన స్టైల్లో సోమర్‌సాల్ట్ విన్యాసాలతో సంబరాలు చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి.
07:24 PM (IST) Jun 21
IND vs ENG: భారత టాపార్డర్ రాణించడంతో ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 471 పరుగులకు ఆలౌట్ అయింది. యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్ లు సెంచరీలతో అదరగొట్టారు.
06:11 PM (IST) Jun 21
IND vs ENG: లీడ్స్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో భారత జట్టు వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ సిక్సర్ తో సెంచరీని పూర్తి చేశారు. ధోని రికార్డును బద్దలు కొట్టడంతో పాటు పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.
05:00 PM (IST) Jun 21
IND vs ENG: ఇంగ్లాండ్ తో జరుగతున్న మొదటి టెస్టు లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ సెంచరీతో దుమ్మురేపాడు. అద్భుతమైన షాట్స్ తో ఇంగ్లాండ్ బౌలింగ్ ను దంచికొట్టాడు.
03:00 PM (IST) Jun 21
సినిమా ప్లాప్ అయితే నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్ కు భారీగా నష్టాలు వస్తుంటాయి. కొన్ని సినిమాలకు మొక్కుబడిగా లాభాలు వస్తుంటాయి. కాని ఒక సినిమా డిజాస్టర్ అవ్వడంతో ఆ ప్రొడ్యూసర్ కు దాదాపు 1300 కోట్లకుపైగా నష్టం వచ్చిందట. ఇంతకీ ఎంటా సినిమా?
02:55 PM (IST) Jun 21
ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నపుడే ఆ ఇళ్లు, ఆ కుటుంబం, ఆ సమాజం బాగుంటుంది. అలా ఉండాలంటే మహిళలపై వేధింపులు ఉండకూడదు. ఇలా మహిళలకు భారతదేశంలోనే సేఫెస్ట్ సిటీ ఏదో తెలుసా?
01:31 PM (IST) Jun 21
విమాన రద్దుల్లో ప్రయాణికులకు వందశాతం రీఫండ్ రావాలంటే ఏమి చేయాలి, ఎలా అభ్యర్థించాలి అన్న వివరాలు ఇక్కడ చదవండి.
01:08 PM (IST) Jun 21
యోగా డే సందర్భంగా విశాఖలో కూటమి ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఈ క్రమంలో ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
10:00 AM (IST) Jun 21
యోగాకు అంతర్జాతీయ క్రీడల్లో స్థానం కల్పించాలని చంద్రబాబు కోరారు. విశాఖపట్నంలో యోగా డే 2025 సందర్భంగా నిర్వహించిన యోగాంధ్ర వేడుకల్లో ప్రధాని మోదీ ముందే ఇలా ఆసక్తికర కామెంట్స్ చేశారు.
08:43 AM (IST) Jun 21
విశాఖ సముద్ర తీరంలో యోగాంధ్ర వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. అంతర్జాతీయ యోగా డే 2025 ని పురస్కరించుకుని విశాఖలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామునే ప్రజలు ఈ కార్యక్రమం కోసం తరలివచ్చారు.
08:09 AM (IST) Jun 21
ప్రతిపక్ష బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.
07:22 AM (IST) Jun 21
ప్రస్తుత ఆందోళనకర సమయంలో ప్రపంచానికి యోగా శాంతిసందేశం ఇస్తోందని ప్రధాాని నరేంద్ర మోదీ అన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న అంతర్జాతీయ యోగా డే వేడుకల్లో ప్రధాని ఆసక్తికర కామెంట్స్ చేశారు.