Hyderbad : అమ్మాయిలకు ఇండియాలోనే సేఫెస్ట్ సిటీ ఏదో తెలుసా?
ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నపుడే ఆ ఇళ్లు, ఆ కుటుంబం, ఆ సమాజం బాగుంటుంది. అలా ఉండాలంటే మహిళలపై వేధింపులు ఉండకూడదు. ఇలా మహిళలకు భారతదేశంలోనే సేఫెస్ట్ సిటీ ఏదో తెలుసా?

Women Safety
Hyderabad : భారతదేశంలో కొన్ని సంఘటనలు మహిళల భద్రతపై అనేక అనుమానాలను రేకెత్తించాయి. దేశ రాజధాని న్యూడిల్లీలో నిర్భయ, హైదరాబాద్ లో దిశ, కోల్ కతా లో మెడికో... ఇలా అమ్మాయిలపై జరిగిన ఆకృత్యాలు యావత్ దేశాన్ని కలచివేసాయి. ఈ ఘటనల తర్వాత ఆడపిల్లలు ఒంటరిగా భయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది... బయటకు వెళ్లిన అమ్మాయి తిరిగి ఇంటికి చేరుకునేవరకు తల్లిదండ్రులకు ఆందోళన తప్పడం లేదు.
ఇలా మహిళల భద్రతపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే దేశంలోని ప్రధాన నగరాల్లో ఎక్కడ అమ్మాయిలు సురక్షితంగా ఉంటున్నారు? ఏ నగరంలో క్రైమ్ రేట్ తక్కువగా ఉంది? మహిళల రక్షణ కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు మెరుగ్గా పనిచేస్తున్నారు?... ఈ ప్రశ్నలన్నింటికి ఒక్కటే సమాధానం హైదరాబాద్. అవును మీరు వింటున్నది నిజమే... దేశంలోనే మహిళలకు సేఫెస్ట్ సిటీగా హైదరాబాద్ నిలిచింది. ఇందుకు గల కారణాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఎందుకు హైదరాబాద్ మహిళలకు సేఫెస్ట్ సిటీ?
1. నగరంలో అత్యధిక సిసి కెమెరాలు
భారతదేశంలోనే అత్యధిక సిసి కెమెరాలు గల నగరం హైదరాబాద్. ఈ ఒక్క నగరంలోనే దాదాపు 5 లక్షలకు పైగా సిసి కెమెరాలు ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దేశంలోని సిసి కెమెరాల్లో 64 శాతం హైదరాబాద్ లోనే ఉన్నట్లు సమాచారం. ఈ సిసి కెమెరాలు కేవలం గొప్పలు చెప్పుకోడానికి కాదు... దాదాపు 80 శాతానికి పైగా వర్కింగ్ స్టేజ్ లో ఉన్నాయట.
ఇలా నగరంలో అడుగడుగునా సిసి కెమెరాల పర్యవేక్షణ ఉండటంతో క్రైమ్ రేట్ చాలా తక్కువ. కాబట్టి అమ్మాయిలపై వేధింపులు, అఘాయిత్యాలు నగరంలో చాలా తక్కువగా నమోదవుతున్నాయి. సైబరాబాద్ ప్రాంతంలో అంటే ఐటీ కంపనీలు ఎక్కువగా వుండే హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో ఈ సిసి కెమెరాల సంఖ్య మరింత ఎక్కువ... ఇది ఐటీ ఉద్యోగాలు చేసే అమ్మాయిలు భద్రతను మరింత పెంచుతుంది.
2. షి టీమ్స్
హైదరాబాద్ లో అమ్మాయిలను వేధించే ఆకతాయిల పని పట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం షీ టీమ్స్ ను ఏర్పాటుచేసింది. కాలేజీ అమ్మాయిలు, ఉద్యోగాలు చేసే యువతులు నగరంలో ఎక్కడ వేధింపులకు గురయినా వెంటనే షీ టీమ్ పోలీసులను సంప్రదించవచ్చు. ఇలా షీ టీమ్స్ ఏర్పాటుతర్వాత నగరంలో మహిళలపై వేధింపులు చాలా తగ్గాయి... ఒంటరిగా బయటకు వెళ్లినా షీ టీమ్స్ ఉన్నాయన్న ధైర్యం అమ్మాయిలకు ఉంటోంది. ఇలా షీ టీమ్స్ వల్ల హైదరాబాద్ మహిళలకు సేఫ్ సిటీగా మారింది.
3. మహిళా ఎంప్లాయ్ మెంట్
ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య ఎక్కువ. ఇంట్లో ఇద్దరు ఉద్యోగాలు కుటుంబ ఆదాయం డబుల్ అవుతుంది.. అప్పుడు క్వాలిటీ లైఫ్ జీవించవచ్చు, పిల్లలకు మంచి సౌకర్యాలు అందించవచ్చనే భావన హైదరాబాదీ మహిళల్లో ఉంది. అందుకే చాలామంది ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి అండగా ఉంటున్నారు.
ఇలా మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వమే కాదు కంపనీల యాజమాన్యాలు కూడా పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మహిళలు వేధింపులకు గురికాకుండా చూస్తున్నారు. దీంతో హైదరాబాద్ లో పనిచేసే మహిళలు సేఫ్ గా ఉంటున్నారు.
4. మహిళల భద్రత కోసం యాప్ లు, హెల్ప్‌లైన్ నంబర్లు:
హైదరాబాద్ లో మహిళల భద్రత కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పలు యాప్స్, హెల్ప్‌లైన్ నంబర్లు ఉన్నాయి. 'సహాయ్' (SAHAS) అనే చాట్‌బాట్, 1930 హెల్ప్‌లైన్ నంబర్లు ఇలాంటివే. ఈ చర్యలు నగరంలో మహిళల భద్రతను మరింత పెంచాయి.
5. ప్రజా రవాణా వ్యవస్థలో ప్రత్యేక చర్యలు
మహిళలు ఎక్కువగా వేధింపులకు గురయ్యేది ప్రజా రవాణా వ్యవస్థలో. కాబట్టి ఇక్కడ మహిళల సేఫ్టీ కోసం చర్యలు చేపట్టారు. నగరంలోని ఆర్టిసి బస్సుల్లో మహిళలు, పురుషులను వేరుచేస్తూ మధ్యలో ఓ షీట్ ను ఏర్పాటుచేసారు. దీంతో బస్సుల్లో మహిళలు మరింత సేఫ్ గా ప్రయాణించగలుగుతున్నారు.
ఇక హైదరాబాద్ మెట్రో, ఎంఎంటిఎస్ మహిళలకు ప్రత్యేక కోచ్ లు ఉంటాయి. కాబట్టి వారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ప్రయాణిస్తున్నారు. మహిళా ఉద్యోగుల ప్రయాణానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.