MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Rishabh Pant: సిక్స్ తో సెంచరీ కొట్టిన రిషబ్ పంత్.. ధోని రికార్డు బద్దలు

Rishabh Pant: సిక్స్ తో సెంచరీ కొట్టిన రిషబ్ పంత్.. ధోని రికార్డు బద్దలు

IND vs ENG: ఇంగ్లాండ్ తో జరుగుతున్న మొదటి టెస్టు లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ సెంచరీతో దుమ్మురేపాడు. అద్భుతమైన షాట్స్ తో ఇంగ్లాండ్ బౌలింగ్ ను దంచికొట్టాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 21 2025, 05:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
England vs India : లీడ్స్‌లో భారత్ జోరు.. మూడో సెంచరీ
Image Credit : ANI

England vs India : లీడ్స్‌లో భారత్ జోరు.. మూడో సెంచరీ

ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా లీడ్స్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో భారత ప్లేయర్లు అద్బుతమైన బ్యాటింగ్ తో అదరగొడుతున్నారు. తొలి రోజు యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్ సెంచరీలో అదరగొట్టగా, రెండో రోజు రిషబ్ పంత్ సెంచరీతో దుమ్మురేపాడు. జైస్వాల్, గిల్, పంత్ సెంచరీతో భారత్ ఇంగ్లాండ్ పై అధిపత్యం కొనసాగిస్తోంది. ఇప్పటికే టీమిండియా స్కోరు 400+ మార్కును దాటింది.

99 పరుగుల వద్ద ఉన్న సమయంలో సూపర్ సిక్సర్ తో పంత్ తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 146 బంతులు ఎదుర్కొని 105 పరుగులతో సెంచరీని పూర్తి చేశాడు. రిషబ్ పంత్ సెంచరీ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. 71.92 స్ట్రైక్ రేటుతో తన సెంచరీని సాధించాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు కొట్టిన వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ రికార్డు
Image Credit : x/BCCI

టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు కొట్టిన వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ రికార్డు

ఇంగ్లాండ్ పై లీడ్స్ లో ఈ సెంచరీతో రిషబ్ పంత్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత టెస్ట్ క్రికెట్‌లో వికెట్ కీపర్ గా ఎక్కువ సెంచీరీలు చేసిన ప్లేయర్ గా ఘనత సాధించాడు. 

భారత వికెట్ కీపర్లు-అత్యధిక సెంచరీలు

రిషభ్ పంత్ – 7 సెంచరీలు

ఎంఎస్ ధోని – 6 సెంచరీలు

వృద్ధిమాన్ సాహా – 3 సెంచరీలు

35
ఇంగ్లాండ్ పై భారత్ ఆధిపత్యం
Image Credit : X/BCCI

ఇంగ్లాండ్ పై భారత్ ఆధిపత్యం

భారత్ జట్టు తొలి రోజు నుంచి ఇంగ్లాండ్ పై పూర్తిగా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. శుక్రవారం ప్రారంభమైన ఈ మ్యాచ్ లో తొలి రోజు భారత జట్టు 359/3 స్కోరుతో డే 1 ముగించింది. కెప్టెన్‌గా తొలిసారి బరిలోకి దిగిన శుభ్‌మన్ గిల్ అజేయంగా 127 పరుగులతో సెంచరీ కొట్టాడు. మొదటి రోజు వైస్-కెప్టెన్ రిషభ్ పంత్ 65 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రెండో రోజు సెంచరీని పూర్తి చేశాడు. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మెరుపు సెంచరీతో (101 పరుగులు) రాణించాడు. గిల్ 147 పరుగులు చేసి రెండో రోజు అవుట్ అయ్యాడు. 

45
టాస్ గెలిచి ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది
Image Credit : ANI

టాస్ గెలిచి ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది

ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. గతంలో హెడింగ్‌లీ మైదానంలో జరిగిన ఆరు టెస్టుల్లో తొలుత బౌలింగ్ చేసిన జట్లు విజయం సాధించిన దృష్ట్యా, స్టోక్స్ ఇదే వ్యూహాన్ని అనుసరించాడు.

"బౌలింగ్ చేస్తాం. హెడింగ్‌లీ మంచి క్రికెట్ పిచ్. ఇక్కడ మేము మంచి మ్యాచులు ఆడాం. మొదటి సెషన్‌లో పిచ్‌కు మద్దతు ఉండొచ్చు. ఇది రెండో సిరీస్ మాత్రమే అనే విషయం కొంచెం ఆశ్చర్యంగా ఉంది. కొంతమంది కౌంటీ క్రికెట్ ఆడారు, మేము మూడు రోజుల ప్రాక్టీస్ చేశాం" అని స్టోక్స్ తెలిపాడు.

భారత్ కెప్టెన్ గిల్ మాట్లాడుతూ: "మేము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లం. మొదటి సెషన్ కాస్త కష్టంగా ఉండొచ్చు, కానీ తర్వాత బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతుంది. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడాం, ప్రిపరేషన్ బాగుంది. సాయి సుదర్శన్ తొలిసారి టెస్ట్ ఆడుతున్నాడు. అతను మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. కరుణ్ కూడా జట్టులో ఉన్నాడు" అన్నారు.

55
జైస్వాల్, గిల్ సెంచరీలు
Image Credit : Getty

జైస్వాల్, గిల్ సెంచరీలు

యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ తొలి రోజు సెంచరీలతో అదరగొట్టారు. దీంతో భారత్ భారీ స్కోర్ దిశగా ముందుకు సాగింది. మొదట జైస్వాల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ పూర్తి చేశాడు. ఈ ప్రదర్శనతో అతను ఆసీస్, ఇంగ్లాండ్‌లో తొలి టెస్టుల్లో సెంచరీ కొట్టిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు.

శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా తన తొలి టెస్ట్‌లోనే శతకం సాధించి అజేయంగా నిలిచాడు. ఇది అతనికి టెస్ట్ కెప్టెన్సీలో తొలి ఇన్నింగ్స్ కావడం విశేషం. భారత్ తరఫున కెప్టెన్‌గా తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లో  సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో గిల్ నాలుగో స్థానంలో చేరాడు.

• విజయ్ హజారే: 164* vs ఇంగ్లాండ్, ఢిల్లీ, 1951

• సునీల్ గవాస్కర్: 116 vs న్యూజిలాండ్, ఆక్‌ల్యాండ్, 1976

• విరాట్ కోహ్లీ: 115 vs ఆస్ట్రేలియా, అడిలైడ్, 2014

• శుభ్‌మన్ గిల్: 127* vs ఇంగ్లాండ్, లీడ్స్, 2025

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
శుభ్‌మన్ గిల్
 
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Glenn Maxwell: అంతర్జాతీయ క్రికెట్‌కు ది బిగ్ షో గుడ్ బై.. గ్లెన్ మాక్స్‌వెల్ రిటైర్మెంట్ కు కారణం ఏమిటి?
Recommended image2
IPL 2027: రూ.14 కోట్ల ప్లేయర్ కు సీఎస్కే గుడ్ బై.. ధోని టీమ్ ఏం ప్లాన్ చేస్తోంది?
Recommended image3
ఐదో టీ20లో భారత్‌కు ఓటమి.. 3-2తో సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
Related Stories
Recommended image1
England vs India Test Match: దుమ్మురేపిన య‌శ‌స్వి.. 58 ఏళ్ల రికార్డు బ్రేక్
Recommended image2
England vs India: తొలి టెస్ట్‌లో భార‌త్‌కు శుభారంభం.. సెంచ‌రీల‌తో చెల‌రేగిన ఇద్ద‌రు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved